For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: షాకింగ్: ఏప్రిల్ నెలలో మారుతీ సుజుకీ సేల్స్ 'జీరో'

|

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ సేల్స్ ఏప్రిల్ నెలలో ఏకంగా జీరోకు పడిపోయాయి. డొమెస్టిక్ మార్కెట్లో తాము సింగిల్ యూనిట్ కూడా విక్రయించలేదని మారుతీ సుజుకీ ఇండియా (MSI) ఈ రోజు (మే 1) తెలిపింది. లాక్ డౌన్ ఆంక్షలతో మారుతీ కార్యాలయాలు క్లోజ్ అయ్యాయి. ఉత్పత్తి నిలిచిపోయింది. మార్చి 24వ తేదీ నుండి కఠిన లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ ఒక్క కారు కూడా విక్రయించలేదు.

భారీగా తగ్గిన బంగారం డిమాండ్, కారణాలివే: కస్టమ్స్, ట్యాక్స్ మినహాయించి 25% పెరుగుదలభారీగా తగ్గిన బంగారం డిమాండ్, కారణాలివే: కస్టమ్స్, ట్యాక్స్ మినహాయించి 25% పెరుగుదల

ఏప్రిల్ 2020లో దేశీయ మార్కెట్లో MSI అమ్మకాలు శూన్యమని మారుతి శుక్రవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఉత్పత్తి సౌకర్యాలు మూసివేయడంతో అమ్మకాలు లేవని పేర్కొంది.

Maruti Suzuki reports zero sales in domestic market in April

ఏప్రిల్‌లో ఇతర ఒరిజినల్ పరికరాల తయారీ సంస్థ (ఓఇఎం) అమ్మకాలు కూడా లేవని వెల్లడించింది. అయితే 632 యూనిట్లను ఎగుమతి చేసినట్టు పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా మారుతి సుజుకి కంపెనీ జూన్ 30వ తేదీ వ‌ర‌కు కార్ల ఉచిత స‌ర్వీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ తేదీల గ‌డువును పొడిగించిన‌ట్లు గతంలో తెలిపింది. దేశంలో కరోనా కేసులు 35వేలు దాటాయి. మృతుల సంఖ్య 1,100 దాటింది.

English summary

COVID 19: షాకింగ్: ఏప్రిల్ నెలలో మారుతీ సుజుకీ సేల్స్ 'జీరో' | Maruti Suzuki reports zero sales in domestic market in April

Maruti Suzuki India (MSI) today reported that it did not sell a single unit in the domestic market last month due to coronavirus-led nationwide lockdown.
Story first published: Friday, May 1, 2020, 12:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X