For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్వార్టర్ 4లో మారుతీ సుజుకీ లాభాలు 30 శాతం వరకు డౌన్!

|

దిగ్గజ కారు మేకర్ మారుతీ సుజుకీ లాభాలు మార్చి క్వార్టర్‌లో 30 శాతం వరకు తగ్గవచ్చునని అంచనా వేస్తున్నారు. మార్చి చివరి వారంలో లాక్ డౌన్ కారణంగా సేల్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ రోజు కంపెనీ తన క్వార్టర్ 4 ఆదాయాలను ప్రకటించనుంది. మార్చి క్వార్టర్ ఆపరేషనల్ రెవెన్యూ 15 శాతం నుండి 20 శాతం వరకు పడిపోవచ్చునని భావిస్తున్నారు. 16 శాతం వరకు అమ్మకాలు తగ్గవచ్చు.

గత ఏడాదితో పోలిస్తే మారుతీ సుజుకీ దేశీయ వ్యాల్యూమ్ క్వార్టర్ 4లో 16 శాతం, తగ్గవచ్చునని, ఎగుమతులు 17 శాతం తగ్గవచ్చునని అంచనా. అమ్మకాలు, రెవెన్యూ ఈసారి భారీగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. నార్నోలియా ఫైనాన్షియల్ సర్వీస్ ప్రకారం రెవెన్యూ దాదాపు 19 శాతం తగ్గుతుంది. ప్రాఫిట్ 32 శాతం తగ్గుతుందని అంచనా.

వారు అడిగిన దాని కంటే భారీ ప్యాకేజీ: నిపుణుల సూచన.. జీడీపీలో 10%వారు అడిగిన దాని కంటే భారీ ప్యాకేజీ: నిపుణుల సూచన.. జీడీపీలో 10%

Maruti Suzuki Q4 Profit may fall around 30 percent

కాగా, కరోనా వ్యాప్తి నిరోధించేందుకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో మారుతీ సుజుకీ అమ్మకాలు ఏప్రిల్ నెలలో జీరోకు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. మిగతా ఆటో దిగ్గజాల సేల్స్ కూడా జీరోకు పడిపోయాయి. మహీంద్రా, హ్యుండాయ్, టయోటా కిర్లోస్కర్, MG ఒక్క వాహనాన్ని విక్రయించలేదు. కరోనా-లాక్ డౌన్ కారణంగా దేశీయ వాహన రంగానికి రూ.1.25 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చునని అంచనా.

English summary

క్వార్టర్ 4లో మారుతీ సుజుకీ లాభాలు 30 శాతం వరకు డౌన్! | Maruti Suzuki Q4 Profit may fall around 30 percent

Company's domestic volumes in Q4 degrew by 16 percent YoY and exports fell 17 percent compared to same period last year.
Story first published: Wednesday, May 13, 2020, 12:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X