For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LTC క్యాష్ వోచర్ స్కీం: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో డిమాండ్‌ను పెంచే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్(LTC) వోచర్ వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా పండుగ సీజన్‌లో డిమాండ్ పెంచేందుకు ఆర్థిక శాఖ ఉద్యోగులకు ఊరట కలిగించింది. ఈ ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీంను మరింతమందికి అందుబాటులోకి తీసుకు వచ్చింది ప్రభుత్వం. నాన్-సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు దీనిని అందుబాటులోకి తెచ్చింది. వీరికి కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పిస్తామని తెలిపింది.

ఉద్యోగులకు ఆఫర్: రూ.50వేలు పొందాలంటే రూ.1.18 లక్షలు ఖర్చు.. LTC స్కీం ప్రయోజనకరమేనా?ఉద్యోగులకు ఆఫర్: రూ.50వేలు పొందాలంటే రూ.1.18 లక్షలు ఖర్చు.. LTC స్కీం ప్రయోజనకరమేనా?

ప్రయివేటు ఉద్యోగులకూ ఎల్టీసీ వోచర్ స్కీం

ప్రయివేటు ఉద్యోగులకూ ఎల్టీసీ వోచర్ స్కీం

రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వరంగ పని చేసే ఎంప్లాయీస్, ప్రయివేటు రంగ ఉద్యోగులకు కూడా ఎల్టీసీ వోచర్ స్కీం అందుబాటులో ఉంటుంది. ఎల్టీకీ ఓచర్ స్కీం కింద ఉద్యోగి కుటుంబం ప్రయాణ ఖర్చును సెలవు దినం లేదా ఉద్యోగుల సొంత పట్టణానికి వెళ్లే ప్రయాణ ఖర్చులను సంస్థ తిరిగి చెల్లిస్తుంది. రీయింబర్స్‌మెంట్ పరిధి ఉద్యోగి హోదాకు లోబడి ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి ఆదాయపుపన్ను చట్టం కింత ఎల్టీసీకి మినహాయింపు ఉంది. నాలుగు సంవత్సరాల బ్లాక్‌లో రెండు ప్రయాణాలకు మినహాయింపు అనుమతిస్తారు.

ఈ నిబంధనలు తప్పనిసరి

ఈ నిబంధనలు తప్పనిసరి

ఎల్టీసీ వోచర్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. 12 శాతం లేదా ఆ పైన జీఎస్టీ ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అది కూడా డిజిటల్ రూపంలో ఉండాలి. అక్టోబర్ 12, 2020 నుండి మార్చి 31, 2021 లోపు ఎల్టీసీ క్యాష్ వోచర్‌ను వినియోగించాలి. అయితే ఎల్టీసీ వోచర్‌కు మూడు రెట్ల ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి రూ.50వేల వోచర్‌కు అర్హులు అనుకుంటే రూ.1.50 లక్షలు ఖర్చు చేయాలి. జీఎస్టీ నెంబర్, జీఎస్టీ వివరాలు తెలియజేయాలి.

వ్యవస్థలోకి నగదు

వ్యవస్థలోకి నగదు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ స్కీంను ఎంచుకుంటే రూ.5675 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కేవలం బ్యాంకులు, ప్రభుత్వ కంపెనీల ఉద్యోగులకే రూ.1900 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. 50 శాతం రాష్ట్రాలు ఈ స్కీంను ఎంచుకుంటే ఎకానమీలోకి రూ.9వేల కోట్లు వస్తాయి. తద్వారా ప్రయివేటు సెక్టార్‌లో ఖర్చులు పెరిగితే వ్యవస్థలోకి రూ.28వేల కోట్ల కన్స్యూమర్ డిమాండ్ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు.

English summary

LTC క్యాష్ వోచర్ స్కీం: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ | LTC cash voucher scheme to non central government employees

The Income Tax (IT) department on Thursday decided to extend the income tax exemption available under leave travel concession (LTC) cash voucher scheme to non-central government employees as well in a bid to boost consumer spending.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X