కరోనా మహమ్మారి మనిషి గమనాన్ని మార్చివేస్తోంది. ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత సామాజిక దూరం పాటించే క్రమంలో భాగంగా చాలామంది వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రజా రవాణా కంటే పర్సనల్ వెహికిల్స్ మేలు అని భావించే వారి సంఖ్య పెరుగుతుందని చెబుతున్నాయి.

చిన్న కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం
మారుతీ సుజుకీ, హోండా, టయోటా, టాటా మోటార్స్ సహా వివిధ సంస్థలు లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వ్యక్తులు పర్సనల్ వెహికిల్స్ కోసం మొగ్గు చూపడం వల్ల సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. వ్యక్తిగత, కుటుంబ ప్రయాణం కోసం వాహనాల కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత తక్కువ ధరలలో లభ్యమయ్యే చిన్న కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ చెబుతోంది.

సేల్స్ పాయింట్స్ వద్ద ఇది గమనించాం
కరోనా - లాక్ డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని, అలాగే ఉద్యోగులకు వేతనాల్లో కోత వంటి ప్రభావం వల్ల కొనుగోలు శక్తిపై ప్రభావం పడిందని, అందుకే తక్కువ ధరలలోని చిన్న కార్లకు ఎక్కువ డిమాండ్ ఉండవచ్చునని, కొద్ది రోజులుగా కార్యకలాపాలు సాగిస్తున్న 1800 సేల్స్ పాయింట్స్ వద్ద తాము దీనిని గమనించామని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్, సేల్స్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు.

ఆర్థిక ఒత్తిళ్లు
గతంలో వినియోగదారులు ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొన్న పలు సందర్భాల్లోను ఇదే ధోరణి కనిపించిందని ఆటోరంగ సంస్థలు చెబుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ పెరుగుతుందని హోండా కార్స్, టయోటా తదితర కంపెనీల ప్రతినిధులు కూడా చెబుతున్నారు.

షేరింగ్‌కు చెక్..!
కరోనా కారణంగా ప్రజారవాణా, షేరింగ్ మొబిలిటీ తగ్గుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఎంట్రీ లెవల్ కార్లతో పాటు ఉపయోగించిన కార్లకు (యూజ్డ్ కార్లు) కూడా డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. కొనుగోలుదారులు ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాండ్ నేమ్ కంటే మంచి నిర్వహణతో కలిగిన కార్లను ఎంచుకుంటారని చెబుతున్నారు. తక్కువ ధరలో ఉండే ఎంట్రీ లెవల్ కార్లకు డిమాండ్ పెరిగినా పరిశ్రమకు రెవెన్యూ పరంగా నిరాశ తప్పకపోవచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications