For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్వీలాంటి మోసాలకు ఇక చెక్, నిబంధనలు కఠినతరం, ఎండీ-చైర్మన్ విభజనకు అందుకే గడువు

|

కార్వీ బ్రోకింగ్ లాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబి చైర్మన్ అజయ్ త్యాగీ తెలిపారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (KSBL)లా క్లయింట్లను మోసం చేసి సొంత అవసరాలకు ఉపయోగించుకునే సంస్థలపై నిఘా పెంచేందుకు నూతన చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పారు.

<strong>భారత ఆర్థిక వ్యవస్థకు పెనుప్రమాదం! వొడాఫోన్-ఐడియా మూతబడితే.. ఎవరెవరిపై ఎలా?</strong>భారత ఆర్థిక వ్యవస్థకు పెనుప్రమాదం! వొడాఫోన్-ఐడియా మూతబడితే.. ఎవరెవరిపై ఎలా?

అప్పుడే లైసెన్స్ రద్దు

అప్పుడే లైసెన్స్ రద్దు

కార్వీ తిరిగి చెల్లింపులపై వేచిచూసే దోరణి అవలంభిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14 నాటికి రూ.1,189 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో బ్యాంకులకు చెల్లించాల్సింది రూ.511 కోట్లు. మొత్తంగా సెక్యూరిటీలు రూ.183 కోట్లు తగ్గాయి. ఫండ్స్ రూ.495 కోట్లు తగ్గినట్లు గుర్తించామని తెలిపారు. గత ఏడాది నవంబర్ నెలలోనే కార్వీలో అవకతవకలను గుర్తించి లైసెన్స్‌లను రద్దు చేసినట్లు తెలిపారు.

అలా బకాయిలు చెల్లించాలి

అలా బకాయిలు చెల్లించాలి

కార్వీ ఇష్యూలో ఆ సంస్థతో పాటు NSEకి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బకాయిల చెల్లింపుకు సంబంధించి సంస్థకు ఊరట కల్పించే అంశాలు సూచించామన్నారు. ఇందులో కార్వీ అనుబంధ సంస్థల్లోని వాటాలను విక్రయించడం ద్వారా సమకూరే నిధుల్ని వచ్చే నెల చివరి వరకు బకాయిలు చెల్లించాలని లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు. బకాయిలు తీర్చకుంటే తగిన చర్యలు ఉంటాయన్నారు.

మార్చికల్లా రూ.678 కోట్లు..

మార్చికల్లా రూ.678 కోట్లు..

తన ఖాతాదారుల సెక్యూరిటీల మొత్తం విలువలై షార్ట్‌ఫాల్ రూ.678 కోట్లను మార్చికల్లా చెల్లిస్తామని NSEకి కార్వీ తెలిపిందని త్యాగి అన్నారు. కార్వీ గ్రూపులోని ఒక కంపెనీలో కొంత వాటాను విక్రయించి, ఈ నిదులను సమీకరిస్తుందన్నారు. ఇది ఎంత వరకు జరుగుతుందో చూడాలన్నారు. ఆ తర్వాతే చర్యలు అన్నారు.

సొమ్ము తిరిగి అందించడమే తొలి ప్రాధాన్యం

సొమ్ము తిరిగి అందించడమే తొలి ప్రాధాన్యం

కార్వీ విషయంలో క్లయింట్లకు చెందిన సెక్యూరిటీలు, సొమ్ము తిరిగి వారికి అందించడమే నియంత్రణ సంస్థ తొలి ప్రాధాన్యత అన్నారు. పెట్టుబడిదారుల శ్రేయస్సుకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. కాగా, కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ల షేర్లను దుర్వినియోగపరిచిన ఆరోపణలు ఎదుర్కొంటోంది. 95,000 మంది క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను వారి అనుమతి లేకుండా తనఖా పెట్టి రూ.600 కోట్లు రుణం తీసుకుంది. దీంతో సెబి ఈ బ్రోకింగ్ సంస్థపై నిషేధం విధించింది. స్టాక్ ఎక్స్చేంజీలు కార్వీ లైసెన్స్‌ను రద్దు చేశాయి.

సీఎండీ పదవి విభజనకు గడువు పెంపు ఎందుకంటే

సీఎండీ పదవి విభజనకు గడువు పెంపు ఎందుకంటే

లిస్టైన కంపెనీల చైర్మన్, ఎండీ పదవుల విభజన గడువును సెబీ 2022 ఏప్రిల్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. నిబంధనలను అమలు చేయడంలో కంపెనీలకు సమస్యలు ఎదురవుతున్నాయని, దీంతో గడువు పొడిగించినట్లు త్యాగీ చెప్పారు. టాప్ 500 కంపెనీల్లో ఇప్పటివరకు 50% సీఎండీ పదవి విభజన జరిగినట్లు చెప్పారు. దాదాపు 250 కంపెనీలు ఇదివరకే చైర్మన్, సీఎండీలను విడగొట్టాయన్నారు.

English summary

కార్వీలాంటి మోసాలకు ఇక చెక్, నిబంధనలు కఠినతరం, ఎండీ-చైర్మన్ విభజనకు అందుకే గడువు | Karvy  plans  stake  sale  to honour client payouts

Karvy Stock Broking Ltd, which is under regulatory scrutiny for alleged misuse of client securities and failing to honour investor payouts, is in active talks to sell stake to meet a shortfall in dues to banks and investors.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X