For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

42% తగ్గిన వాహనాల సేల్స్, పట్టణం కంటే గ్రామీణం బెట్టర్.. ఎందుకంటే

|

కరోనా మహమ్మారి ప్రభావం ఆటోపరిశ్రమపై ఇంకా భారీగానే కనిపిస్తోంది. జూన్ నెలలో పాసింజర్ వెహికిల్ రిటైల్ సేల్స్ అంతకుముందు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 38.34 శాతం తగ్గి 1,26,417కు పడిపోయాయి. ఈ మేరకు ఫెడరేషథన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) మంగళవారం తెలిపింది. 1440 రీజినల్ ట్రాన్సుపోర్ట్ కార్యాలయాలు(RTO) ఉండగా 1230 కార్యాలయాల నుండి డేటా సేకరించింది. 2019 జూన్ నెలలో సేల్స్ 2,05,011గా ఉన్నాయి.

వర్కింగ్ హవర్స్ 8 గం. నుండి 12 గం.: అదనపు శాలరీ ఇస్తేనే ఓవర్ టైమ్ లేదా సెలవు ఇవ్వాలివర్కింగ్ హవర్స్ 8 గం. నుండి 12 గం.: అదనపు శాలరీ ఇస్తేనే ఓవర్ టైమ్ లేదా సెలవు ఇవ్వాలి

42 శాతం తగ్గిన సేల్స్

42 శాతం తగ్గిన సేల్స్

టూ-వీలర్ సేల్స్ 2019 జూన్ నెలలో 13,37,462 యూనిట్లు అమ్ముడుపోగా ఈ ఏడాది ఇదే నెలలో 40.92 శాతం తగ్గి 7,90,118 యూనిట్లకు పరిమితమయ్యాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ అయితే ఏకంగా 83.83 శాతం తగ్గాయి. గత ఏడాది 64,976 యూనిట్లు సేల్ కాగా ఈసారి 10,509కు పరిమితమయ్యాయి. త్రీ-వీలర్ సేల్స్ గత ఏడాది 48,804 అమ్ముడుపోగా ఈసారి 75.43 శాతం తగ్గి 11,993గా ఉన్నాయి. అన్ని కేటగిరీల సేల్స్ 2019 జూన్ నెలలో 16,97,166 యూనిట్లుగా ఉండగా, ఈసారి 42 శాతం తగ్గి 9,84,395గా ఉన్నాయి.

పట్టణం కంటే గ్రామీణం బెస్ట్.. పెరిగిన ట్రాక్టర్ సేల్స్

పట్టణం కంటే గ్రామీణం బెస్ట్.. పెరిగిన ట్రాక్టర్ సేల్స్

ఆర్థిక వ్యవస్థ మందగమనానికి తోడు కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పెరగడం వెహికిల్ సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణమని FADA ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలే అన్నారు. కస్టమర్ విశ్వాసంపై తీవ్రమైన ప్రభావం పడిందని చెప్పారు. ముఖ్యమంగా పెద్ద నగరాల్లోనే ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. గ్రామీణ మార్కెట్లు మాత్రం కాస్త ఊరటనిచ్చినట్లు తెలిపారు. వర్షాకాలం కావడం, పంటలు పెరగడం వల్ల పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ రిటైల్ అమ్మకాలు పెరగడానికి దోహదపడిందని చెప్పారు.

జూన్ కంటే జూలై కాస్త బెట్టర్

జూన్ కంటే జూలై కాస్త బెట్టర్

కమర్షియల్ వెహికిల్ సెక్టార్ పునరుజ్జీవనం కోసం ఆకర్షణీయమైన ప్రోత్సాహక ఆధారిత వాహన స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని కాలే అన్నారు. జూలై సేల్స్ ఎలా ఉంటాయనే అంశం గురించి కూడా స్పందించారు. లాక్ డౌన్ లేకపోవడం వంటి వివిధ కారణాలతో జూలై నెలలో వాహనాల సేల్స్ జూన్ కంటే కాస్త బెట్టర్‌గా ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. ఎన్బీఎఫ్‌సీ, రిటైల్ రుణాల ఇబ్బందుల సవాళ్లు ఉన్నాయని, అందుకే డిమాండ్ వేగంగా పుంజుకోవడానికి కొంత సమయం పట్టవచ్చునన్నారు. గ్రామీణంలో ట్రాక్టర్ సెగ్మెంట్ మినహా మిగతా అన్ని సేల్స్ భారీగా పడిపోయినట్లు చెప్పారు.

English summary

42% తగ్గిన వాహనాల సేల్స్, పట్టణం కంటే గ్రామీణం బెట్టర్.. ఎందుకంటే | June passenger vehicle sales dip 38 percent to 126,417 units

Passenger vehicle retail sales in June fell 38.34 per cent to 1,26,417units as compared to the same month last year as Covid-19 continued to impact the sentiment of buyers, automobile dealers' body FADA said on Tuesday.
Story first published: Wednesday, July 22, 2020, 12:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X