For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: ఏ దేశంలో ఎంతమంది ఉద్యోగాలకు కోత? అమెరికాకు షాక్, జపాన్ సేఫ్!

|

కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీగానే ఉండనుంది. అదే సమయంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మహమ్మారిని ఇప్పటికీ కంట్రోల్ చేయలేకుంటే ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.

షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?షాక్: అమెరికాలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉడిపోయే అవకాశముందంటే? ఇండియన్స్ ఏమంటున్నారు?

2.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం

2.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం

కరోనాను తక్షణమే నియంత్రించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోతాయని ILO తెలిపింది. 1930నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మళ్లీ తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. కరోనా కారణంగా ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలు చేపట్టేందుకు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాయని ఓ నివేదికలో వెల్లడించింది.

అమెరికాలో మహామాంద్యం

అమెరికాలో మహామాంద్యం

ఆస్ట్రియా నుండి అమెరికా వరకు ఉద్యోగాల కోత ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా, యూరోప్ దేశాల్లో నిరుద్యోగిత రేటు టీనేజ్ యువతలో భారీగా పెరుగుతోందని ఇప్పటికే డచ్ బ్యాంక్ ఏజీ ఎకనమిక్ రీసెర్చ్ గ్లోబల్ హెడ్ పీటర్ హూపర్ వెల్లడించారు. అమెరికా, యూరోప్‌లలో మహామాంద్యం కనిపిస్తోందని చెబుతున్నారు.

ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి

ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా విస్తరించకుండా వివిధ దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ప్రజా జీవనం స్తంభించింది. దీంతో ఉత్పత్తి పడిపోయింది. ఈ పరిణామంతో వివిధ దేశాలు సంస్థలను నడపలేక ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెరికా, యూరప్‌లలో నిరుద్యోగం రేటు రెండు అంకెలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులు సద్దుమణిగే వరకు కూడా ఉద్యోగాలను తొలగించవద్దని యాజమాన్యాలను ఒప్పించేందుకు ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఉందంటున్నారు.

వచ్చే ఏడాదికి కోలుకోవచ్చు

వచ్చే ఏడాదికి కోలుకోవచ్చు

జేపీ మోర్గాన్ చేస్ అండ్ కో ఆర్థికవేత్తల అంచనా ప్రకారం 2020 మిడిల్ నాటికి ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు 2.7 శాతం పాయింట్లు పెరుగుతుంది. ఈ ఏడాది గత నాలుగు దశాబ్దాల కనిష్టానికి చేరుకుంటుంది. అయితే 2021 నాటికి ఆర్థిక వ్యవస్థలు కోలుకున్నాక కుదుటపడుతుంది. అయినప్పటికీ 2021 చివరి నాటికి అమెరికాలో 4.6 శాతం, యూరో ప్రాంతంలో 8.3 శాతం నిరుద్యోగిత ఉంటుందని అంచనా.

అమెరికా కంటే జపాన్ మెరుగు

అమెరికా కంటే జపాన్ మెరుగు

ఆయా సామాజిక పరిస్థితుల ఆధారంగా లేబర్ మార్కెట్ పైన ప్రభావం పడుతుంది. యూరో ప్రాంతం లేదా జపాన్ కంటే అమెరికాలోనే ఎక్కువ ఉద్యోగాలు పోతాయి. గత నెలలో అమెరికాలో ఉద్యోగ డేటాలో తగ్గుదల కనిపించింది. గత పదేళ్ల కాలంలో ఇలా తగ్గడం మొదటిసారి. పేరోల్ ఆర్థికవేత్తలు అంచనా వేసిన దాని కంటే ఏడు రెట్లు పడిపోయి 7 లక్షలకు పైగా ఉంది. నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గత వారం ఇది 6.65 మిలియన్లకు చేరుకుంది.

బ్రిటన్‌లోను ఇదే పరిస్థితి

బ్రిటన్‌లోను ఇదే పరిస్థితి

గోల్డ్‌మన్ సాచ్ గ్రూప్ ఇంక్ అంచనా ప్రకారం నిరుద్యోగిత రేటు ఇక్కడ 15 శాతానికి చేరుకుంటుంది. ఇక, బ్రిటన్‌లో రెండు వారాల వ్యవధిలోనే 1 మిలియన్ మంది సంక్షేమ చెల్లింపుల (వెల్ఫేర్ పేమెంట్స్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. సాధారణం కంటే ఇది 10 రెట్లు. బ్రిటన్‌లో 27 శాతం మందిని తాత్కాలికంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు.

స్పెయిన్ మరీ దారుణం

స్పెయిన్ మరీ దారుణం

స్పెయిన్‌లో నిరుద్యోగ -క్లెయిమ్స్ భారీగా పెరిగాయి. ఇక్కడ నిరుద్యోగిత రేటు ఇప్పటికే 14 శాతం ఉంది. ఎన్నో దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఆస్ట్రియా నిరుద్యోగిత రేటు 12 శాతం పెరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణ పరిస్థితి ఎదుర్కొంటోంది.

జర్మనీలో నిరుద్యోగం తెలియాల్సి ఉంది

జర్మనీలో నిరుద్యోగం తెలియాల్సి ఉంది

జర్మనీలో మాత్రం నిరుద్యోగ రేటు అంతగా పెరగలేదు. అయితే ఈ డేటా షట్ డౌన్‌కు ముందుది. వచ్చే నెలలో ఇందుకు సంబంధించి డేటా వస్తుంది. అప్పుడు ఎంత నిరుద్యోగిత రేటు పెరిగిందో తెలియాలి. ఈ దేశంలో గంట పనికి వేతనం ఇచ్చే విధానం అమల్లో ఉంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని గంటలను రికార్డు స్థాయిలో తగ్గించాయి. దేశంలో దాదాపు 4,70,000 కంపెనీలు జర్మనీ ప్రభుత్వానికి వేతన మద్దతు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి.

ఫ్రెంచ్‌లో ప్రభుత్వాలపై ఆధారం

ఫ్రెంచ్‌లో ప్రభుత్వాలపై ఆధారం

ఫ్రెంచ్ వ్యాపారాలు కూడా తమ ఉద్యోగులను తొలగించకుండా ఉండేందుకు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. గురువారం నాటికి 4 లక్షల కంపెనీలు 40 మిలియన్ల వర్కర్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 20 శాతం మందికి వేతనాలు చెల్లించే పరిస్థితి చెబుతున్నాయి. ఫిన్‌లాండ్, నార్వేలలోను నిరుద్యోగిత రేటు పెరిగింది. థాయ్‌లాండ్‌లో 2.3 కోట్ల మంది అంటే ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. జనాభాలో ఇది మూడో వంతు జనాభా.

చైనాలో 80 లక్షల మంది..

చైనాలో 80 లక్షల మంది..

చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. రెండు నెలలు తర్వాత ఒక్కటొక్కటి తెరుచుకుంటున్నాయి. కరోనా కారణంగా ఇక్కడ దాదాపు 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అంచనా. ఫిబ్రవరిలో చైనాలో నిరుద్యోగిత రేటు 6.2 శాతానికి పడిపోయింది.

English summary

COVID 19: ఏ దేశంలో ఎంతమంది ఉద్యోగాలకు కోత? అమెరికాకు షాక్, జపాన్ సేఫ్! | Jobs destroyed worldwide as coronavirus sparks recession

The world's workers are reeling from the initial shock of the coronavirus recession, with job losses and welfare claims around the globe already running into the millions this week.
Story first published: Sunday, April 5, 2020, 8:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X