For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగాలకు కరోనా దెబ్బ... ఇండియాలో పెరుగుతున్న నిరుద్యోగ రేటు!

|

మూలుగుతున్న నక్కపై తాడి పండు పడ్డట్టు... అసలే ఏడాది కాలంగా ఇండియన్ ఎకానమీ పరిస్థితి బాగోలేదు. ఆర్థిక మందగమనం పెచ్చరిల్లి అన్ని రంగాలకూ విస్తరించింది. ఆ దెబ్బకు ఇప్పటికే లక్షల్లో ఉద్యోగాలు పోయాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో పది లక్షలకు పైగా ఉద్యోగాలు ఊడినట్లు అనేక సర్వేలు వెల్లడించాయి. ఎఫ్ఎఫ్ సిజి, రిటైల్ సహా అనేక ఇతర రంగాలదీ ఇదే దారి. ఇదిలా ఉండగానే... కరోనా వైరస్ బయటపడటంతో చైనా సహా ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పటికే చైనాలో చాలా ఫ్యాక్టరీలు మూతపడి ప్రొడక్షన్ తగ్గిపోయింది.

తద్ఫలితంగా ఉద్యోగాలకు ముప్పొచ్చింది. ఇప్పుడు కరోనా మహమ్మారి చైనా గోడలు దాటి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దక్షిణ కొరియా, జపాన్, హాంగ్ కాంగ్, శరాన్, ఇటలీ, సింగపూర్, అమెరికా ఇలా అనేక దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల రేటు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ తో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3,000 కు పైగా మృత్యువాత పడ్డారు. 1,00,000 మందికి పైగా ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.

PAN-Aadhaar link: మార్చి 31లోగా లింక్ చేయకుంటే భారీ షాక్, మళ్లీ అప్లై చేయొద్దు..PAN-Aadhaar link: మార్చి 31లోగా లింక్ చేయకుంటే భారీ షాక్, మళ్లీ అప్లై చేయొద్దు..

హైదరాబాద్ కూ వచ్చేసింది...

హైదరాబాద్ కూ వచ్చేసింది...

ఇప్పటివరకు అనేక దేశాలను చుట్టిన వచ్చిన కరోనా వైరస్... తాజాగా ఇండియాకు కూడా వచ్చేసింది. ఢిల్లీ, హైదరాబాద్ మహా నగరాల్లో ఒక్కోటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేరళ లో ఉన్న కేసులతో కలుపుకుంటే మూడు రాష్ట్రాల్లో కరోనా కనిపించినట్లైంది. చైనా లేదా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్ లో వైరస్ వ్యాప్తిని అరికట్టడం అంత తేలిక కాదు. ఎందుకంటే, ఇండియా లో జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు. మార్కెట్ల నుంచి, షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడైనా పెద్ద సంఖ్యలో జన సముదాయం కనిపిస్తుంది. దీంతో, ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాప్తి చెందే అవకాశాలు అధికం అని నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ వ్యాప్తి చెందితే జన సంచారంపై ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది. అది కాస్తా అనేక వ్యాపారాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. చివరకు ఉద్యోగాలకే ముప్పు వాటిల్లుతుంది.

ఫిబ్రవరిలో పెరిగిన నిరుద్యోగం...

ఫిబ్రవరిలో పెరిగిన నిరుద్యోగం...

ఇండియాలో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇటీవల వెలువడిన అంచనాల ప్రకారం ఫిబ్రవరి నెలలో దేశంలో సగటు నిరుద్యోగ రేటు సుమారు 8% గా నమోదయ్యింది. జనవరి నెలలో ఇది సుమారు 7% మేరకు ఉండగా... ఒక్క నెలలోనే 70 బేసిస్ పాయింట్ల నుంచి 100 బేసిస్ పాయింట్ల వరకు పెరిగిపోవటం గమనార్హం. గత నాలుగైదు నెలలతో పోల్చినా కూడా ఫిబ్రవరిలో నమోదైన నిరుద్యోగ రేటే అధికం కావటం విశేషం. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మరింత అధికంగా ఉంటోంది. సగటున అది 9% వరకు నమోదైనట్లు అనధికారిక అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ రేటు 5% సగటు నుంచి 7% వరకు పెరుగుతోందని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం...

ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం...

కరోనా వర్సెస్ పుణ్యమా అని చైనా సహా అనేక దేశాల నుంచి మన దేశానికి జరగాల్సిన ఎగుమతులు నిలిచిపోయాయి. దిగుమతులు కూడా తగ్గిపోయాయి. దీంతో, ఎక్సపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారాల్లో నిమగ్నమైన రంగాలపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడుతోంది. ఇప్పటికే కాంట్రాక్టు మీద పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ప్రారంభం కాబోతోందని అనేక వార్తలు వెలువడుతున్నాయి. పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే.. పోర్టులు, ఎయిర్పోర్టులు ... వాటి అనుబంధ రంగాలన్నీ కుదేలవుతాయి. ఆతిథ్య రంగం, పర్యాటకంపైనా ప్రభావం పడి .. చివరకు ఉద్యోగాలు ఊడే పరిస్థితులు ఏర్పడతాయి. అది దేశంలో మరింత నిరుద్యోగం పెరిగేందుకు కారణమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary

ఉద్యోగాలకు కరోనా దెబ్బ... ఇండియాలో పెరుగుతున్న నిరుద్యోగ రేటు! | Job market will get affected due to the corona outbreak

Experts fear about the raising unemployment rate in India due to the slowdown. And they expect that the job market in India will get affected due to the corona virus outbreak which has been spreading across the world. The novel virus has already come to Delhi, Hyderabad and Kerala in India, unless the it is controlled efficiently, it may lead to further unemployment due to declining imports and exports in the country.
Story first published: Tuesday, March 3, 2020, 7:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X