For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4G ఎల్టీఈ కనెక్టివిటీ, జియో ఆండ్రాయిడ్ ఓఎస్‌తో జియోబుక్ ల్యాప్‌టాప్

|

టెలికం, డిజిటల్ రంగంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. తక్కువ ధరకే ఇంటర్నెట్, వాయిస్ కాల్, ఫీర్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చి, టెలికం రంగంలో అతి తక్కువ కాలంలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది రిలయన్స్ జియో. ఇప్పుడు జియో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కార్యాచరణ చివరి దశలో ఉందని తెలుస్తోంది. జియో బుక్ పేరుతో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ మే నెలలో జియో బుక్స్ మార్కెట్లోకి వస్తాయని అంటున్నారు.

HDFC గుడ్‌న్యూస్, హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: SBI, కొటక్ బ్యాంకులోను...HDFC గుడ్‌న్యూస్, హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: SBI, కొటక్ బ్యాంకులోను...

జియో ల్యాప్‌టాప్‌లో ఇవి..

జియో ల్యాప్‌టాప్‌లో ఇవి..

ల్యాప్‌టాప్ తయారీ ఖర్చులను తగ్గించేందుకు క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను జియో ఉపయోగిస్తోందని వార్తలు వస్తున్నాయి. 11 నానో మీటర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇప్పటికే వివిధ మొబైల్ ఫోన్లలో ఈ చిప్ వినియోగిస్తున్నారు. ఇన్‌బిల్ట్ 4H LTE మోడెమ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇందులో వీడియో కోసం మినీ HDMI, 5 GHz వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలేరోమీటర్, క్వాల్‌కామ్ ఆడియో చిప్స్ వినియోగిస్తున్నారు.

మొబైల్ నుండి ల్యాప్‌టాప్ వైపు

మొబైల్ నుండి ల్యాప్‌టాప్ వైపు

ఈ ల్యాప్‌టాప్ జియో స్టోర్, జియో మీట్, జియో పేజెస్, జియో యాడ్ సర్వీసులను ముందుగానే లోడ్ చేసి ఉంచుతారని సమాచారం. ఈ ల్యాప్ ధరకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది. మొబైల్ ఫోన్స్‌ను తక్కువ ధరకే అందిస్తోన్న జియో ఇప్పుడు ల్యాప్‌టాప్స్‌ను కూడా తక్కువ ధరలో తీసుకు వస్తుంది.

సెల్యులార్ కనెక్షన్

సెల్యులార్ కనెక్షన్

ఈ జియో ల్యాప్‌టాప్ సెల్యూలార్ కనెక్షన్‌తో పని చేసే ల్యాప్‌టాప్స్ తయారీ పైనే జియో ఆసక్తి చూపిస్తోందని అమెరికా క్వాల్‌కామ్ టెక్నాలజీస్ సీనియర్ ప్రోడక్ట్ డైరెక్టర్ మిగ్యుల్ న్యూన్స్ మూడెళ్ల క్రితం తెలిపారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ అంశం మళ్లీ వెలుగు చూసింది. సాధారణ ల్యాప్‌టాప్స్ మాదిరి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో కాకుండా గూగుల్ ఆండ్రాయిడ్ OSతో ఇవి పని చేస్తాయి. ఆండ్రాయిడ్ OSలో కొన్ని మార్పులు చేసి ఈ ల్యాప్‌టాప్స్ ఉపయోగిస్తారు. దీనిని జియో ఓఎస్ అంటారు.

English summary

4G ఎల్టీఈ కనెక్టివిటీ, జియో ఆండ్రాయిడ్ ఓఎస్‌తో జియోబుక్ ల్యాప్‌టాప్ | Jio Working on Low Cost Laptop JioBook With 4G LTE Connectivity, Android-Based JioOS

Reliance Jio is working on a low-cost laptop called the “JioBook”, according to a report. The new laptop is said to be based on a forked Android build that could be dubbed JioOS.
Story first published: Sunday, March 7, 2021, 9:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X