For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయోజనం కలిగేలా సవరణలతో ఐటీ రిటర్న్స్ ఫారాలు

|

పొడిగించిన గడువుకు అనుగుణంగా ఆదాయపు పన్ను శాఖ 2019-20 ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ ఫారాలలో సవరణలు చేస్తోంది. ఈ మేరకు ప్రకటన చేసింది. సవరణల్ని ఈ నెల చివరి వరకు ప్రకటించి మే నెల చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సర పన్ను మినహాయింపు పెట్టుబడులు (సెక్షన్ 80సీ), మెడిక్లెయిమ్స్ (సెక్షన్ 80డి), డొనేషన్ (సెక్షన్ 80జీ) గడువును ప్రభుత్వం జూన్ నెలాఖరు వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు ఈ ప్రయోజనాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఐటీ రిటర్న్ ఫారాల్లో సవరణలు చేస్తోంది.

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్: శాలరీ పెంపు, ప్రమోషన్లు లేవు, కొత్త ఆఫర్లకు ఓకేఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్: శాలరీ పెంపు, ప్రమోషన్లు లేవు, కొత్త ఆఫర్లకు ఓకే

ITR forms being revised for benefits of timeline extension

కొన్ని రకాల పన్ను చెల్లింపు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ నెల నుంచి జూన్ వరకు చేసిన కొన్ని ట్రాన్సాక్షన్లపై పన్ను మినహాయింపులు ఉంటాయని తెలిపింది. దీంతో సీబీడీటీ ఐటీఆర్ ఫారాలలో కొన్ని మార్పులు చేస్తోంది.

గడువును ఏఫ్రిల్ నుండి జూన్ వరకు పొడిగించినందున ట్యాక్స్ పేయర్స్ ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రాన్సాక్షన్స్‌కు ప్రయోజనం కలిగే విధంగా ట్యాక్స్ ఫారంలలో అవసరమైన మార్పులు చేస్తున్నామని సీబీడీటీ తెలిపింది.

English summary

ప్రయోజనం కలిగేలా సవరణలతో ఐటీ రిటర్న్స్ ఫారాలు | ITR forms being revised for benefits of timeline extension

By continuing to use this site you consent to the use of cookies on your device as described in our Cookie Policy unless you have disabled them. You can change your Cookie Settings at any time but parts of our site will not function correctly without them.
Story first published: Tuesday, April 21, 2020, 15:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X