59.68 లక్షలమందికి రూ.1.40 లక్షల కోట్లు చెల్లింపు
కరోనా మహమ్మారి నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లకు ఇబ్బంది కలగకుండా సీబీడీటీ (సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) ట్యాక్స్ రీఫండ్‌ను వేగవంతం చేసింది. ప్రతి సంవత్సరం వలె ఈసారి కూడా పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ప్రాసెస్‌ను మరింత వేగం చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు మొత్తం రూ.1,40,210 కోట్ల నిధులను ట్యాక్స్ పేయర్స్‌కు రీఫండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
ఇందులో పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ (PIT) రీఫండ్ రూ.38,105 కోట్లు కాగా, కార్పోరేట్ ట్యాక్స్ రీఫండ్స్ రూ.1,02 లక్షల కోట్లు ఉంది. మొత్తం 59.68 లక్షల ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. ఇందులో 57,68,926 పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ పేయర్లు, 1,99,165 మంది కార్పోరేట్ ట్యాక్స్ పేయర్స్‌కు చెల్లింపులు జరిపారు.
'తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అమెరికా, వీరి ముందు సవాళ్లు'

కరోనా నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం పన్ను సంబంధిత సేవల్ని ఇబ్బందుల్లేకుండా అందిస్తోంది. ఇందులో భాగంగా ట్యాక్స్ పేయర్స్ రీఫండ్ చేయాల్సిన మొత్తాలను వేగవంతంగా చెల్లిస్తోంది. కోవిడ్ 19 నేపథ్యంలో ప్యాకేజీతో పాటు కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. కేంద్రం వివిధ చర్యలు తీసుకుంది.
పీఎఫ్ అకౌంట్ నుండి ఉద్యోగులు మూడు నెలల వేతనం లేదా 75 శాతం.. ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తం తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని కూడా పొడిగించి వెసులుబాటు కల్పించింది.