For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Refund: రూ.67,000 కోట్ల రీఫండ్స్, ఐటీ రిటర్న్స్ స్టేటస్ ఇలా తెలుసుకోండి...

|

2021-22 ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో రూ.67,400 కోట్ల మేర ఆదాయ పన్ను రీఫండ్ చెల్లింపులు జరిపినట్లు ఆదాయపు పన్ను మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలలో తెలిపింది. ఏప్రిల్ 1 నుండి ఆగస్ట్ 30వ తేదీ లోపు 23.99 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్‌కు రూ.67 వేల కోట్లు రిఫండ్ చేసినట్లు తెలిపింది. ఇందులో 22.61 లక్షల కేసులకు సంబంధించిన రూ.16,373 కోట్లు రిఫండ్, కార్పొరేట్ ట్యాక్స్‍‌కు సంబంధించి రూ.51 వేల కోట్లను (రూ.51,029 కోట్లు) రీఫండ్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాకెస్స్(CBDT) తెలిపింది.

ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌తో ప‌న్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో ఈస్ధాయిలో రీఫండ్స్ జారీ కావ‌డం ఊరట. ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌లో స‌మ‌స్య‌ల‌ కారణంగా పలువురు ట్యాక్స్ పేయర్స్ త‌మ ఐటీ రిట‌న్స‌ను సమర్పించలేదు. సాధార‌ణంగా ఐటీ రిటర్న్స్ దాఖ‌లు చేసిన ప‌దిరోజుల్లోగా రిఫండ్స్ జారీ చేస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు మీకు రీఫండ్ కాకుంటే ఐటీ శాఖ‌ వెబ్‌సైట్‌లో రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

IT Refund: CBDT issues refund of over Rs 67, 000 crore till August 30

రీఫండ్ స్టేటస్ చెకింగ్ ఎలా?

- ఇన్‌కం ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి.

- యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆప్ ఇన్-కార్పోరేషన్ పేర్కొనాలి.

- My Account ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

- Refund/Demand Status ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

- మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఐటీ రిటర్న్స్ స్టేటస్ కనిపిస్తుంది. మీ స్క్రీన్ పైన అసెస్‌మెంట్ ఇయర్, పేమెంట్ మెథడ్ వంటివి కనిపిస్తాయి.

English summary

IT Refund: రూ.67,000 కోట్ల రీఫండ్స్, ఐటీ రిటర్న్స్ స్టేటస్ ఇలా తెలుసుకోండి... | IT Refund: CBDT issues refund of over Rs 67, 000 crore till August 30

The Central Board of Direct Taxes (CBDT) has issued refunds of over Rs. 67,401 crore to more than 23.99 lakh taxpayers between April 1, 2021 to August 30, 2021, said Income Tax India on Saturday.
Story first published: Sunday, September 5, 2021, 15:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X