For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాది గడిచినా, ఆదాయపు పన్ను పోర్టల్‌లో సమస్యలు

|

కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ వచ్చి ఏడాది అవుతోంది. అయినా ఇప్పటికీ సమస్యలు తీరలేదు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఐటీ శాఖ గత ఏడాది మే నెలలో కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను తీసుకు వచ్చింది. ఈ కొత్త ఐటీ పోర్టల్ ప్రారంభమైన నేటికి ఏడాది. ఈ కొత్త వెబ్ సైట్ ప్రారంభం నుండి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో సమస్య వచ్చింది.

సెర్చ్ ఆప్షన్ సరిగ్గా పని చేయకపోవడంతో మంగళవారం ఆధాయపు పన్ను శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కొత్త వెబ్ సైట్‌ను రూపొందించిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దృష్టికి సమస్యను తీసుకు వెళ్లినట్లు ఐటీ విభాగం తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది.

IT portal develops snag on first anniversary

ఆదాయపు పన్ను పోర్టల్ హ్యాక్‌కు గురై ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఈ అంశంపై స్పందించింది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు వెళ్లలేదని, గత ఏడాది వ్యవధిలో ఐటీ వెబ్ సైట్‌లో పలుమార్లు సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం ఐటీ రిటర్న్స్ దాఖలు తుది గడువును పలుమార్లు పొడిగించింది.

English summary

ఏడాది గడిచినా, ఆదాయపు పన్ను పోర్టల్‌లో సమస్యలు | IT portal develops snag on first anniversary

The IT Department acknowledged the glitch several users reported while accessing the online income tax portal and assured that Bengaluru-based IT major Infosys is looking into it.
Story first published: Tuesday, June 7, 2022, 18:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X