For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Innerwears: ఇన్నర్‌వేర్ అమ్మకాలు మాంద్యాన్ని సూచిస్తాయా..? అందుకే ఈ కంపెనీ లాభాలు క్షీణించాయా..!

|

Innerwears: ఆర్థిక మాంద్యానికి.. ఇన్నర్‌వేర్స్ అమ్మకాలకు లింక్ ఏంటా అని మనలో చాలా మందికి అనుమానం కలగవచ్చు. కానీ ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉందని తెలిస్తే హవాక్కవుతారు. దీనిని నిరూపించే సాక్ష్యం కూడా ప్రస్తుతం మన ముందు ఉంది. ఈ ఆసక్తికరమైన అంశం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డాలర్ ఇండస్ట్రీస్..

డాలర్ ఇండస్ట్రీస్..

దేశీయ ఇన్నర్‌వేర్ తయారీ సంస్థ డాలర్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ నష్టాన్ని చవిచూసింది. క్వార్టర్ కాలంలో కంపెనీ విక్రయాలు 12.48% క్షీణించి రూ.341.92 కోట్లకు చేరుకున్నాయి. దీంతో కంపెనీ లాభాలు ఏకంగా గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 60.49% క్షీణించి రూ.17.29 కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2021 త్రైమాసికంలో లాభం రూ.43.76 కోట్లుగా ఉంది.

స్టాక్ అమ్మేస్తున్న ఇన్వెస్టర్స్..

స్టాక్ అమ్మేస్తున్న ఇన్వెస్టర్స్..

కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన అనేక మంది ఇన్వెస్టర్లు వాటాలను అమ్మేస్తున్నారు. దీంతో డాలర్ ఇండస్ట్రీస్ షేరు శుక్రవారం ఏకంగా 6.72% పడిపోయింది. దీంతో షేర్ ధర NSEలో రూ.452.05 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.2,560 కోట్ల పడిపోయింది. ఈ ఏడాది జనవరి 20న షేరు 52 వారాల గరిష్ఠ ధర అయిన రూ.665.70 వద్ద ఉంది. గతేడాది డిసెంబర్ 20న షేరు ధర రూ.397.30గా ఉంది.

కంపెనీ వివరణ..

డాలర్ ఇండస్ట్రీస్ మేనేజ్‌మెంట్ పనితీరుకు భారతీయ హోజరీ రంగంలో మందగమనం కారణమని పేర్కొంది. పత్తి, నూలు వంటి ముడి పదార్థాల ధరలు హెచ్చుతగ్గులు కూడా రంగంపై ప్రభావాన్ని చూపాయి. వీటి ధరల పతనం కారణంగా కంపెనీ గణనీయమైన ఇన్వెంటరీ నష్టాలను చవిచూసిందని యాజమాన్యం తెలిపింది. ఇది తాత్కాలికమేనని డాలర్ ఇండస్ట్రీస్ అభిప్రాయపడింది.

ఇన్నర్‌వేర్స్.. ఆర్థిక సంక్షోభం..

ఇన్నర్‌వేర్స్.. ఆర్థిక సంక్షోభం..

మగవారి అండర్ వేర్స్ ఇండెక్స్(men's underwear index) అనేది ఆర్థిక పరిస్థితుల గమనాన్ని గుర్తించేందుకు వినియోగిస్తారు. ఆర్థిక మందగమనం సమయంలో రికవరీ ప్రారంభాన్ని దీనిద్వారానే గుర్తిస్తారు. సాధారణ ఆర్థిక సమయాల్లో పురుషుల లోదుస్తులు అమ్మకాలు స్థిరంగా ఉంటాయి. 2007-2009 ఆర్థిక మాంద్యం సమయంలో అమెరికాలో పురుషుల లోదుస్తుల అమ్మకాలు భారీగా దెబ్బతిన్నాయి.

English summary

Innerwears: ఇన్నర్‌వేర్ అమ్మకాలు మాంద్యాన్ని సూచిస్తాయా..? అందుకే ఈ కంపెనీ లాభాలు క్షీణించాయా..! | Innerwear maker Dollar Industries profit fell 60 percent in september quarter

Innerwear maker Dollar Industries profit fell 60 percent in september quarter
Story first published: Sunday, November 13, 2022, 19:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X