For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్... జులైలో 10.4శాతం తగ్గిన పారిశ్రామిక ఉత్పత్తి...

|

గత ఏడాది జులైలో జరిగిన పారిశ్రామిక ఉత్పత్తితో పోల్చితే ఈ ఏడాది జులైలో పారిశ్రామిక ఉత్పత్తి 10.4శాతం తగ్గినట్లు గణాంకాలు,కార్యక్రమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్(IIP) డేటాలో వెల్లడైంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో 54.0శాతం,మే నెలలో 89.5శాతం,జూన్‌లో 108.9శాతం పారిశ్రామిక ఉత్పత్తి జరగ్గా... జులైలో 118.1శాతం జరిగినట్లు ఐఐపీ డేటాలో పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే జూన్‌లో 16.6శాతం ఉత్పత్తి తగ్గగా... జులైలో 10.4శాతం ఉత్పత్తి తగ్గింది.

Indias Industrial Output Contracts By 10.4 percentage In July

మైనింగ్ రంగంలో జులైలో 87.2శాతం ఉత్పత్తి జరగ్గా,మాన్యుఫాక్చర్ రంగంలో 118.8శాతం,విద్యుత్ రంగంలో 166.3శాతం ఉత్పత్తి జరిగింది. అలాగే ప్రైమరీ గూడ్స్ 114.1శాతం,కేపిటల్ గూడ్స్ 70.9శాతం,ఇంటర్మీడియట్ గూడ్స్ 122.9శాతం,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్ 125.2శాతం ఉత్పత్తి జరిగింది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి లాక్ డౌన్ అమలైన కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయినట్లు ఆ డేటాలో తెలిపారు. పరిశ్రమల ఉత్పత్తులపై కరోనా ప్రభావం పడిందని... ఆంక్షలను సడలించడంతో ఇప్పుడిప్పుడే అన్ని రంగాల పరిశ్రమలు తెరుచుకుంటున్నాయని పేర్కొంది. కాగా,లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుండటం... చేతిలో డబ్బు లేని పరిస్థితుల్లో... మార్కెట్లో ఉత్పత్తుల డిమాండ్ కూడా తగ్గింది. డిమాండ్ పడిపోవడంతో ప్రొడక్షన్ కూడా తగ్గిందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary

కరోనా ఎఫెక్ట్... జులైలో 10.4శాతం తగ్గిన పారిశ్రామిక ఉత్పత్తి... | Indias Industrial Output Contracts By 10.4 percentage In July

India's industrial output contracted by 10.4 percent in July 2020 when compared to growth of 4.3 percent seen in the same month a year ago. Data on Quick Estimates of Index of Industrial Production (IIP) released by the Ministry of Statistics & Programme Implementation on Friday shows that the index for July stood at 118.1 against 54.0, 89.5 and 108.9 for April 2020, May 2020 and June 2020, respectively.
Story first published: Saturday, September 12, 2020, 23:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X