For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గనున్న ఇంధన డిమాండ్, కారణాలు ఇవే..: ఫిచ్

|

2020 క్యాలెండర్ ఏడాదిలో భారత్ ఇంధన డిమాండ్ 11.5 శాతం క్షీణిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ మైనస్ 8.6 శాతం కంటే పడిపోవచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇంధన డిమాండ్‌ను ఫిచే సొల్యూషన్స్ సవరించింది. అంతకుముందు ఇంధన డిమాండ్ వృద్ధి మైనస్ 9.4 శాతం ఉంటుందని అంచనా వేసింది.

కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో మూడు నెలలకు పైగా చమురు వినియోగంపై ప్రభావం పడింది. గత కొద్ది నెలలుగా మాత్రమే కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవుతుండటంతో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు పాటు డిమాండ్ లేకపోవడంతో ఇంధన డిమాండ్ భారీగా తగ్గనుందని తెలిపింది. అలాగే 2020-21లో జీడీపీ మైనస్ 8.6 శాతంతో భారీగా పతనం కానుందని తెలిపింది.

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్స్ దూకుడు .. ఆరునెలల్లో 100 శాతం .. రీజన్ ఇదేడాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్స్ దూకుడు .. ఆరునెలల్లో 100 శాతం .. రీజన్ ఇదే

India’s fuel demand to contract 11.5 percent in 2020: Fitch

దేశవ్యాప్తంగా చమురుకు డిమాండ్ పడిపోయిందని, ముఖ్యంగా వినియోగదారులు, పరిశ్రమల నుండి కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమని ఫిచ్ తెలిపింది. ఈ మహమ్మారితో లక్షలాదిమంది ఉపాధి కోల్పోవడం, మరోవైపు ఆదాయం అంతకంతకూ తగ్గడం, దీంతో ఖర్చులు తగ్గించుకోవడం వంటి కారణాలతో ఇంధన డిమాండ్ పడిపోవచ్చునని తెలిపింది. అంతేకాదు, కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్నిచోట్ల లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతుండటం కూడా కారణమని వెల్లడించింది.

English summary

భారీగా తగ్గనున్న ఇంధన డిమాండ్, కారణాలు ఇవే..: ఫిచ్ | India’s fuel demand to contract 11.5 percent in 2020: Fitch

Fitch Solutions has revised downward its forecast for fuel demand contraction in India to 11.5 per cent in 2020 in line with further deterioration in the country’s economic outlook.
Story first published: Sunday, September 20, 2020, 13:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X