For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ... చైనా మొబైల్స్‌దే హవా: ఎక్కువగా కొనుగోలు చేసింది ఇవే

|

ఈ ఏడాది ప్రారంభంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్‌లో బాయ్‌కాట్ చైనా ఉద్యమం వచ్చింది. చైనా ఉత్పత్తులను చాలామంది తగ్గించారు. దీంతో దేశంలో 80 శాతానికి పైగా ఉన్న చైనా మొబైల్ మార్కెట్ వాటా ఆ దిగువకు వచ్చింది. అయితే, ఆది కొద్ది రోజులే. మళ్లీ చైనా మొబైల్ హవా కొనసాగుతోంది. 2019 అక్టోబర్ నెలతో పోలిస్తే 2020 అక్టోబర్‌లో చైనా మొబైల్ విక్రయాలు 17 లక్షల యూనిట్లు పెరిగాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్, పడిపోయిన ఆఫీస్ స్పేస్ లీజింగ్వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్, పడిపోయిన ఆఫీస్ స్పేస్ లీజింగ్

17 లక్షల యూనిట్లు ఎక్కువగా

17 లక్షల యూనిట్లు ఎక్కువగా

టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ డేటా ప్రకారం గత అక్టోబర్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 42 శాతం వృద్ధి చెంది 2.1 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విక్రయాలు ఇందులో ఉన్నాయి. అయితే ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారా విక్రయంచారు. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 బ్రాండ్లలో నాలుగు... షియోమీ, వివో, రియల్-మీ, ఒప్పో చైనాకు చెందిన కంపెనీలు. గత ఏడాది అక్టోబర్‌లో 46.07 లక్షల యూనిట్లుగా నమోదైన ఈ నాలుగు బ్రాండ్స్ సేల్ ఈ ఏడాది అక్టోబర్‌లో 63.01 లక్షలగా నమోదయింది. అంటే 17 లక్షల యూనిట్లు ఎక్కువగా సేల్ అయ్యాయి.

రెండో స్థానంలో షియోమీ

రెండో స్థానంలో షియోమీ

భారత్-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం 200కు పైగా చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. చైనా వస్తువుల బహిష్కరణ నేపథ్యంలో శాంసంగ్ మాత్రం కాస్త ముందుకు వచ్చి రెండో స్థానంలో ఉంది. గత కొద్ది నెలలుగా శాంసంగ్.. షియోమీ తర్వాత ఉంటోంది.

ఏ కంపెనీ సేల్స్ ఎంతంటే

ఏ కంపెనీ సేల్స్ ఎంతంటే

2019 అక్టోబర్ నెలలో షియోమీ సేల్స్ రూ.24.5 లక్షలు కాగా, 2020 అక్టోబర్‌లో రూ.29.12 లక్షలుగా ఉంది.

2019 అక్టోబర్ నెలలో శాంసంగ్ సేల్స్ రూ.10.8 లక్షలు కాగా, 2020 అక్టోబర్‌లో రూ.22.6 లక్షలుగా ఉంది.

2019 అక్టోబర్ నెలలో వివో సేల్స్ రూ.7.4 లక్షలు కాగా, 2020 అక్టోబర్‌లో రూ.6.3 లక్షలుగా ఉంది.

2019 అక్టోబర్ నెలలో రియల్-మి సేల్స్ రూ.10.6 లక్షలు కాగా, 2020 అక్టోబర్‌లో రూ.22.1 లక్షలుగా ఉంది.

2019 అక్టోబర్ నెలలో ఒప్పో సేల్స్ రూ.3.4 లక్షలు కాగా, 2020 అక్టోబర్‌లో రూ.5.4 లక్షలుగా ఉంది.

2019 అక్టోబర్ నెలలో మొత్తం సేల్స్ రూ.56.91 లక్షలుగా ఉండగా, 2020 అక్టోబర్‌లో రూ.85.69 లక్షల కోట్లుగా నమోదయింది.

English summary

ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ... చైనా మొబైల్స్‌దే హవా: ఎక్కువగా కొనుగోలు చేసింది ఇవే | Indians bought 17 lakh more Chinese phones this October than October 2019 despite Galwan

Data on online smartphone shopping has shown that Indians bought 17 lakh more Chinese devices this October than they did last year.
Story first published: Wednesday, December 30, 2020, 9:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X