For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2021: ఆ రైలులో ఇక స్మార్ట్ విండో, ఫుడ్ సంస్థలతో కలిసి ఆదాయం పెంపు ప్లాన్

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. నేడు (శుక్రవారం, జనవరి 29) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ దశాబ్దంలో ఇవి తొలి బడ్జెట్ సెషన్స్ కాగా, నేడు తొలి సెషన్. కరోనా వైరస్ కారణంగా నిర్మలమ్మ బడ్జెట్ పైన వివిధ రంగాలు కోటి ఆశలతో ఉన్నాయి. కరోనా కారణంగా 2020లో రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌ను ఈ ప్రకటనలకు కొనసాగింపుగా చూడాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి

ఆ రైల్లో తొలుత స్మార్ట్ విండో-స్విచ్

ఆ రైల్లో తొలుత స్మార్ట్ విండో-స్విచ్

ప్రతి బడ్జెట్‌లో ప్రతి రాష్ట్రం, కోట్లాదిమంది బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులపై కూడా ఆసక్తి కనబరచడం సహజం. ఈసారి రైల్వేల్లో భద్రతకోసం ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ విండోను తీసుకు వస్తున్నారు. ఇది ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉండటంతో పాటు, ప్రైవసీ కూడా ఉంటుందని భావిస్తున్నారు. తొలుత న్యూఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో దీనిని ప్రవేశపెట్టనున్నారు. స్మార్ట్ స్విచ్ ఆన్ చేస్తే రైలు బోగీ కిటికీలు, లోపలు తలుపులు పారదర్శకంగా మారుతాయి. స్విచ్ ఆఫ్ చేస్తే యథావిధిగా మార్చుకోవచ్చు.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

ప్రయాణీకులను అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది. బయటి ప్రయాణీకులకు కనిపించరు. ఇది వారికి ప్రైవసీని కల్పిస్తుంది. బోగీల మధ్య ఉన్న గ్లాస్ డోర్లను కూడా ఇదే విధంగా మార్చనున్నారు. ఈ స్మార్ట్ విండోలను న్యూఢిల్లీ-హౌరా రాజధాని రైలులోని ఏసీ1 కోచ్‌లో ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ విండో ప్రయాణీకులను అవాంఛి లైట్ నుండి కాపాడుతుంది. కఠిన యూవీ కిరణాల నుండి భద్రత ఇస్తుంది. ఈ కిటికీలు ప్రయాణీకులకు మంచి ప్రయాణ అనుభవాన్ని కూడా కలిగిస్తాయి.

రెడీ టూ ఈట్ మీల్

రెడీ టూ ఈట్ మీల్

ఇదిలా ఉండగా, ఈ బడ్జెట్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ IRCTC ఆదాయం పెంచే చర్యలు చేపట్టవచ్చునని తెలుస్తోంది. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కేటరింగ్ విభాగం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అడుగులు వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా విమాన సేవల వలె రెడీ టూ ఈట్ మీల్స్ ప్రవేశ పెట్టే అవకాశముంది. దీనిని అమలు చేసేందుకు హల్దీరామ్, ఐటీసీ, ఎండీఆర్, వాగ్ బక్రీ, ఇతర ఆహార సంస్థలతో కలవనుందని తెలుస్తోంది. ఆ తర్వాత దీనిని IRCTCకి అప్పగించవచ్చు.

English summary

Budget 2021: ఆ రైలులో ఇక స్మార్ట్ విండో, ఫుడ్ సంస్థలతో కలిసి ఆదాయం పెంపు ప్లాన్ | Indian Railways install smart windows in train for better passenger experience

Indian Railways has been consistently providing many facilities in trains to improve the passenger experience. Latest in the list of convenient feature for passenger is the smart train window.
Story first published: Friday, January 29, 2021, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X