For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్‌లో పెరిగిన నిరుద్యోగిత రేటు, హర్యానాలో అధికం

|

భారత్‌లో నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నెలలో 7.83 శాతానికి పెరిగింది. ఇది మార్చి నెలలో 7.60 శాతంగా ఉండగా, గత నెల నాటికి పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నివేదిక వెల్లడించింది. పట్టణ నిరుద్యోగిత రేటు 9.22 శాతానికి పెరిగింది. మార్చి నెలలో ఇది 8.28 శాతంగా మాత్రమే ఉంది.

ఇక గ్రామీణ నిరుద్యోగిత రేటు మాత్రం మార్చిలో 7.29 శాతం నుండి ఏప్రిల్ నెలలో 7.18 శాతానికి తగ్గింది. నిరుద్యోగిత రేటు అత్యధికంగా నార్త్-ఈస్ట్ రాష్ట్రాల్లో ఉంది. హర్యనాలో 34.5 శాతం, రాజస్థాన్‌లో 28.8 శాతం, బీహార్‌లో 21.1 శాతంగా ఉంది. తక్కువ నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, 0.2 శాతం, చత్తీస్‌గఢ్ 0.6 శాతం, అసోం 1.2 శాతంగా నమోదయింది.

నిరుద్యోగం అందుకే పెరిగింది

నిరుద్యోగం అందుకే పెరిగింది

దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆర్థిక రికవరీ మరింతగా నెమ్మదించడం వంటి అంశాలు ఉద్యోగ అవకాశాలు దెబ్బతినడానికి కారణంగా మారాయి. రిటైల్ ద్రవ్యోల్భణం మార్చి నెలలో 17 నెలల గరిష్టస్థాయి 6.95 శాతానికి పెరిగి, ఈ ఏడాది చివరలో 7.5 గరిష్టస్థాయికి చేరుకునే అవకాశముందని ఆర్థిక నిపుణుల మాట. జూన్‌లో సెంట్రల్ బ్యాంకు రెపో రేటును పెంచవచ్చునని భావిస్తున్నారు. సీఎంఐఈ గణాంకాలను ఆర్థిక నిపుణులు నిశితంగా పరిశీలిస్తారు.

మందగమనం

మందగమనం

కరోనా సమయంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మార్చి 2019లో 43.7 శాతం నుండి 2022 మార్చి నాటికి 39.5 శాతానికి పడిపోయింది. ఆర్థిక మందగమనం వల్ల ఏప్రిల్ నెలలో నిరుద్యోగం పెరిగిందని సీఎంఐఈ పేర్కొంది. దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

దేశంలో నెలకొన్న ఉద్యోగాల కల్పన లేమి సమస్య కారణంతో పాటు తమకు తగిన ఉద్యోగాలు లభించకపోవడంతో కోట్లాదిమంది ఉద్యోగాల వేట ఆపేశారని, కార్మిక శక్తి నుండి వైదొలుగుతున్నారని సీఎంఐఈ గత నెలలో పేర్కొంది. మార్చి నెలలో లేబర్ ఫోర్స్ 38 లక్షలు తగ్గినట్లు తెలిపింది.

వృద్ధి రేటు

వృద్ధి రేటు

ఆర్థిక వ్యవస్థలో సరిపడా ఉద్యోగాలను సృష్టించేందుకు వృద్ధి రేటు 6 శాతం నుండి 8 శాతం మధ్య ఉంటే సరిపోదని, అంతకుమించి ఉండాల్సిన అవసరముందని CMIE అభిప్రాయపడింది. మరోవైపు మార్చిలో సీపీఐ ద్రవ్యోల్బణం 6.95%తో 17 నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 7.5%కు చేరుకోవచ్చునని అంచనాలు ఉన్నాయి. హోల్ సేల్ ద్రవ్యోల్భణ సూచీ WPI 4 నెలల గరిష్ఠం 14.55%కి చేరింది.

English summary

ఏప్రిల్‌లో పెరిగిన నిరుద్యోగిత రేటు, హర్యానాలో అధికం | India's unemployment rate rises to 7.83 percent in April, highest in Haryana

India’s unemployment rate rose to 7.83% in April from 7.60% in March, data from the Centre for Monitoring Indian Economy (CMIE) showed on Sunday.
Story first published: Tuesday, May 3, 2022, 11:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X