వొడాఫోన్ కంపెనీ చెల్లించాల్సిన రూ.20వేల కోట్ల రెట్రోస్పెక్టేటివ్ పన్ను కేసులో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ తీర్పును భారత్ సవాల్ చేయనుంది. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయ సలహా కోరినట్లుగా తెలుస్తోంది. స్థానిక పార్లమెంట్ రూపొందించిన చట్టాలను దాటి ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ఇవ్వకూడదని తుషార్ మెహతా అన్నారు. దిహెగ్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు రెట్రోస్పెక్టేటివ్ కేసులో గత నెలలో వొడాఫోన్ ఐడియాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని సవాల్ భారత్ సవాల్ చేయనుంది.

బకాయిలు వసూలు చేయద్దు.. రూ.40 కోట్లు చెల్లించాలి
ఆదాయపన్ను శాఖ పారదర్శకంగా, సమానంగా చూడటంలో విఫలమైందని, వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం పన్ను విధించడం సరికాదని ఆర్బిట్రేషన్ కోర్టు పేర్కొంది. ఇది భారత్-నెదర్లాండ్స్ మధ్య ఉన్న పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘించడమని వొడాఫోన్ వాదనలు వినిపించింది. వొడాఫోన్ నుంచి బాకీల వసూలును తక్షణమే నిలిపివేయాలని, అలాగే కోర్టు ఖర్చుల కింద రూ.40 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. పన్నులు, పెనాల్టీ, వడ్డీ రూ.22,000 కోట్లను వసూలు చేయడాన్ని నిలిపివేసింది. వొడాఫోన్ నుండి బకాయిలు చేయకూడదని తెలిపింది.

ఏం జరిగింది?
2007లో భారత్‌లో టెలికం సేవలు అందిస్తున్న హచిసన్ ఈక్విటీలో 67 శాతం వాటాను వొడాఫోన్ రూ.1,100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. దీనికి టీడీఎస్ కింద రూ.11,000 కోట్లు చెల్లించాలని ఆదాయపన్ను శాఖ అప్పుడు నోటీసులు పంపించింది. వొడాఫోన్ ఈ మొత్తం చెల్లించకపోవడంతో జరిమానా, వడ్డీ రూ.20వేల కోట్లకు పెరిగింది. రూ.12వేల కోట్ల వడ్డీ, రూ.7,900 కోట్ల పెనాల్టీ ఉంది.
2012 జనవరిలో ఐటీ శాఖ డిమాండును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆ తర్వాత రెండు నెలలకు కేంద్ర ప్రభుత్వం పాత తేదీలతో వర్తించేలా చట్టాన్ని సవరించింది.

2014లో ఆర్బిట్రేషన్‌కు
అనంతరం వొడాఫోన్ గ్రూప్‌కు పన్ను చెల్లించాలని నోటీసులు పంపించింది. దీంతో 2014లో వొడాఫోన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక్కడ గత నెలలో వొడాఫోన్‌కు ఊరట లభించింది. దీనిపై భారత్ సవాల్ చేయాలని తుషార్ మెహతా అన్నారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌తో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించాలన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications