For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Salary Hikes: 2023లో ప్రపంచ వ్యాప్తంగా జీతాల పెంపు ఉంటుందా..? భారత్ పరిస్థితి ఇదే..!

|

Salary Hikes: ప్రస్తుతం తరుణంలో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మందగమనం, అధిక ధరలు జీతాలపై ఆధారపడి జీవించే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు జీతాల పెరుగుదలను ఆశించకుండా పని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

జీతాల పెంపుపై సర్వే..

జీతాల పెంపుపై సర్వే..

2023లో ప్రపంచవ్యాప్తంగా జీతాల పెంపుపై ఒక సర్వే నిర్వహించారు. 2023లోనూ ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనాలు చెప్పటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీల పనితీరు సైతం పేలవంగా ఉన్నందున ఊహించిన స్థాయిలో జీతాల పెంపు ఉండదని నిపుణులు చెబుతున్నారు. చాలా దేశాల్లో కంపెనీలు శాలరీ హైక్స్ ప్రకటించవని తెలుస్తోంది.

కొన్ని దేశాల్లో.. భారత్

కొన్ని దేశాల్లో.. భారత్

ఇలాంటి తరుణంలో.. కొన్ని దేశాల్లో మాత్రం ప్రస్తుత వేతనం కంటే ఎక్కువ చేల్లించనున్నట్లు సర్వేలో తేలింది. అయితే ఈ జాబితాలో భారత్ ఉంటుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ భారత పారిశ్రామిక వృద్ధి శుభశూచికంగానే చెప్పుకోవచ్చు. అందువల్ల వచ్చే ఏడాది యథావిధిగా జీతాల పెంపును కంపెనీలు ప్రకటిస్తాయని సర్వే నివేదిక వెల్లడించటం గమనార్హం.

బ్రిటన్ పరిస్థితి..

బ్రిటన్ పరిస్థితి..

UK కార్మికులకు 2022 చెడ్డ సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడి ఉద్యోగులకు సగటున 3.5 శాతం వేతనాలు పెరిగినప్పటికీ.. 9.1% మంది ఉద్యోగులకు మాత్రం ద్రవ్యోల్బణం కారణంగా జీతాలు తగ్గించారు. 2023లో మరో 4 శాతం మంది బ్రిటన్‌లో వేతన కోతను ఎదుర్కోవచ్చని వెల్లడైంది.

ఆసియా దేశాలు..

ఆసియా దేశాలు..

ప్రపంచవ్యాప్తంగా జీతాలు పెంచుతున్న 10 దేశాల్లో 8 ఆసియా ఖండంలోనే ఉండటం పెద్ద ఊరటనిస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. భారత కంపెనీలు ముఖ్యంగా స్టార్టప్‌లు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుని లాభదాయకత వైపు పయనిస్తున్నందున మనదేశంలో జీతాల్లో కోత ఉండబోదని తెలుస్తోంది. కార్మికులు ఉద్యోగాన్ని కోల్పోరని తాజా సర్వే నివేదిక పేర్కొంది.

టాప్-10 దేశాల వివరాలు..

టాప్-10 దేశాల వివరాలు..

2023లో జీతాలు పెరుగుతాయని భావిస్తున్న టాప్-10 దేశాల జాబితాను ఒక సారి పరిశీలిద్దాం. ఇందులో 4.6% వేతనాల పెంపుతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వా త 4% తో వియత్నాం, 3.8% తో చైనా, 3.4% తో బ్రెజిల్, 2.3% తో సౌదీ అరేబియా, 2.2% తో మలేషియా, 2.2% తో కంబోడియా, 2.2% తో థాయిలాండ్, 2% తో ఒమన్, 1.9% తో రష్యా జీతాల పెంపును ప్రకటిస్తాయని సర్వే తెలిపింది.

Read more about: salaries jobs india salary hikes
English summary

Salary Hikes: 2023లో ప్రపంచ వ్యాప్తంగా జీతాల పెంపు ఉంటుందా..? భారత్ పరిస్థితి ఇదే..! | India Stood 1st place for salary hikes across world in 2023 survey revealed

India Stood 1st place for salary hikes across world in 2023 survey revealed
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X