For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూన్‌లో దేశీయ వాణిజ్య లోటు 25.6 బిలియన్ డాలర్లు

|

భారత వాణిజ్య లోటు జూన్ నెలలో 25.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశీయంగా ఎగుమతులు పుంజుకోవడంతో గత నెలలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 16.78 శాతం ఎగిసి 37.94 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే నెలలో దిగుమతులు 51 శాతం పెరిగి 63.58 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం రికార్డ్ స్థాయికి చేరుకున్నది.

గత మూడు నెలలుగాపెరుగుతూ వచ్చిన వాణిజ్య లోటు జూన్ నెలకు గాను 25.53 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో నమోదైన 9.61 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, కమోడిటీ ధరలు పెరగడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.మరోవైపు డాలర్ మారకంతో రూపాయి ఈ ఏడాది ఆరు శాతం క్షీణించింది.

Indias trade deficit at record high of $25.63 billion in June

మొదటి త్రైమాసికంలో నాన్-పెట్రోలియం ఎగుమతులు 11.9 శాతం పెరిగి 92.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రెడీమేడ్ గార్మెంట్స్ ఉత్పత్తుల ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. జూన్ 2021 నుండి జూన్ 2022 మధ్య క్రూడ్, పెట్రోలియం దిగుమతులు 94 శాతం, కోల్, కోక్ ఇంపోర్ట్స్ 241 శాతం, గోల్డ్ ఇంపోర్ట్స్ 169 శాతం పెరిగాయి.

English summary

జూన్‌లో దేశీయ వాణిజ్య లోటు 25.6 బిలియన్ డాలర్లు | India's trade deficit at record high of $25.63 billion in June

India's merchandise trade deficit grew to a record $25.63 billion in June from $9.61 billion during the same period last year, stated the data released by the Commerce Ministry.
Story first published: Tuesday, July 5, 2022, 9:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X