For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒపెక్ నుండి తగ్గి, అమెరికా నుండి పెరిగి.. మే నెలలో 8 ఏళ్ల కనిష్టానికి చమురు దిగుమతి

|

కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో జనజీవనం స్తంభించడంతో మే నెలలో చమురు దిగుమతి భారీగా తగ్గి ఎనిమిదేళ్ల కనిష్టానికి చేరుకుంది. మే నెలలో భారత చమురుకంపెనీలు రోజుకు 3.18 బ్యారెళ్ల ఆయిల్‌ను ((bpd) దిగుమతి చేసుకున్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది 31 శాతం తగ్గుదల. ఏడాది కింద ఇదే మే నెలతో పోలిస్తే 26 శాతం తగ్గుదల. దీంతో చమురు దిగుమతులు గత నెలలో 2011 కనిష్టానికి చేరుకున్నట్లు డేటా ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.

సంక్షోభంలో చమురు ఇండస్ట్రీ, క్రూడాయిల్ భద్రతపై చైనా వ్యూహంసంక్షోభంలో చమురు ఇండస్ట్రీ, క్రూడాయిల్ భద్రతపై చైనా వ్యూహం

తక్కువ ధరకే చమురు నిల్వ

తక్కువ ధరకే చమురు నిల్వ

కరోనా-లాక్ డౌన్ కారణంగా ఊహించని స్థాయికి చమురు డిమాండ్ తగ్గింది. ఈ మహమ్మారి దెబ్బకి అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా భారీగా పడిపోయాయి. దీంతో ఏప్రిల్ నెలలో ఇండియన్ రిఫైనరీలు తక్కువ ధరతో నిల్వ చేసుకున్నాయి. సాధారణంగా రిఫైనరీస్ ఒకటి రెండు నెలల ముందు అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటాయి. కానీ కొన్నింటిని వాయిదా వేశాయి. మే నెలలో వరుసగా రెండో నెల భారత్‌కు చమురు దిగుమతి చేసిన వాటిలో రెండో దేశంగా నిలిచింది. అయినప్పటికీ ఏప్రిల్ నెల నుండి ఇఖ్కడి నుండి చమురు దిగుమతులు 28 శాతం తగ్గాయి.

రిలయన్స్ సహా తగ్గిన దిగుమతి

రిలయన్స్ సహా తగ్గిన దిగుమతి

ఇరాక్ నుండి భారత చమురు దిగుమతులు 43 శాతం తగ్గి రోజుకు 5,54,000 బ్యారెళ్లకు పడిపోయాయి. అక్టోబర్ 2016 తర్వాత ఇది కనిష్టస్థాయి. వెనిజులా చమురు దిగుమతులు 2011 తర్వాత ఈ మే నెలలో కనిష్టానికి పడిపోయాయి. వరల్డ్ బిగ్గెస్ట్ రిఫైనిరీ కాంప్లెక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మే నెలలో వెనిజులా నుండి 2 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. మరో ప్రయివేటు రిఫైనరీ నయారా ఎనర్జీ కూడా లాటిన్ అమెరికా నేషన్ నుండి మే నెలలో దిగుమతి చేసుకోలేదు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో దిగుమతి నిలిచిపోయింది.

తగ్గిన ఓపెక్ దేశాల చమురు దిగుమతులు

తగ్గిన ఓపెక్ దేశాల చమురు దిగుమతులు

ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ తగ్గడంతో వెనిజులా సహా ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు అన్నీ కూడా ఉత్పత్తిని తగ్గించాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC) దేశాల నుండి మన దేశానికి చమురు దిగుమతులు ఏకంగా 71.3 శాతం పడిపోయాయి. అదే సమయంలో అమెరికా చమురు వాటా మే నెలలో రికార్డ్ స్థాయిలో ఎనిమిది శాతానికి చేరింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు తిరిగి తెరుచుకోవడంతో జూన్ నెలలో చమురు దిగుమతులు పెరగనున్నాయి. నాలుగైదేళ్లలోనే అమెరికా ఆరో చమురు సరఫరాదారుగా మారింది. 2017 నుండి దిగుమతులు ప్రారంభమయ్యాయి. మొదటి ఆర్థిక సంవత్సరంలో రోజుకు 38,000 బ్యారెళ్లు ఉండగా 2018-19 నాటికి 1,24,000 బ్యారెళ్లకు చేరుకుంది.

English summary

ఒపెక్ నుండి తగ్గి, అమెరికా నుండి పెరిగి.. మే నెలలో 8 ఏళ్ల కనిష్టానికి చమురు దిగుమతి | India's oil imports in May sink to lowest in over 8 years

India's oil imports in May hit the lowest since Oct 2011 as refiners with brimming storage cut purchases after a continuous decline in fuel demand, preliminary data obtained from industry sources showed.
Story first published: Wednesday, June 24, 2020, 12:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X