For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1,500 కోట్ల శశికళ ఆస్తులు ఆటాచ్: వందల కోట్లు ఎవరి పేరు మీద ఉన్నాయంటే?

|

చెన్నై: దివంగత జయలలిత స్నేహితురాలు శశికళకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు బారీ షాకిచ్చారు. శశికళకు చెందిన ఆస్తులను జఫ్తు చేశారు. ఆమెకు చెందిన దాదాపు 1,500 కోట్ల విలువైన అసెట్స్‌ను బినామీ చ‌ట్టం కింద అటాచ్ చేశారు. ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సుమారు 10 కంపెనీల‌లో సోదాలు నిర్వహించి శ‌శిక‌ళ ఆస్తుల‌ను సీజ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండేళ్లుగా (2017 నుంచి) శ‌శిక‌ళ బెంగుళూరులోని పరప్పణ అగ్ర‌హారం జైలులో శిక్ష‌ను అనుభవిస్తున్నారు.

లాయర్లకు జగన్ గుడ్‌న్యూస్: లా నేస్తం స్కీంలాయర్లకు జగన్ గుడ్‌న్యూస్: లా నేస్తం స్కీం

రూ.1500 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు..

రూ.1500 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు..

2016 నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్ల రద్దు అంతరం ఆమె ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరిలో మొత్తం తొమ్మిది ఆస్తులను జఫ్తు చేశారు. ఈ విషయాన్ని శశికళకు కూడా తెలియజేశారని తెలుస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఆమె రూ.1500 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 2017లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాల్లో ఈ విషయం వెలుగు చూసింది.

ఎవరి పేరు మీద కొనుగోలు చేసిందంటే?

ఎవరి పేరు మీద కొనుగోలు చేసిందంటే?

శశికళ ఈ ఆస్తులను తన ఇళ్లలో పని చేసే కారు డ్రైవర్, సర్వెంట్లు, అసిస్టెంట్లు తదిరులపై కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే, తన స్నేహితులు, బిజినెస్ అసోసియేట్స్ పేర్ల పైన కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఈ ఆస్తులు కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ ఆస్తులు స్వాధీనం

ఈ ఆస్తులు స్వాధీనం

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసిన ఆస్తుల్లో... చెన్నైలోని పెరంబూర్లో ఓ మాల్, రిసార్ట్స్, కోయంబత్తూరులోని పేపర్ మిల్లు, చెన్నైలోని ఓ ఫౌండేషన్‌కు చెందిన స్పెక్ట్రమ్ మాల్.. ఇలా వివిధ ఆస్తులు అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది.

కీలక పత్రాలు స్వాధీనం

కీలక పత్రాలు స్వాధీనం

ఆపరేషన్ క్లీన్ మనీ కింద 2017 నవంబర్‌లో ఆదాయపు పన్ను శాఖకు చెందిన 1800 మంది అధికారులు చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరిలలోని శశికళ, ఆమె కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బినామీ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

English summary

రూ.1,500 కోట్ల శశికళ ఆస్తులు ఆటాచ్: వందల కోట్లు ఎవరి పేరు మీద ఉన్నాయంటే? | Income Tax dept attaches alleged properties of Sasikala worth Rs 1500 crore

The Income Tax department attached properties worth Rs 1500 crore that allegedly belong to VK Sasikala. The properties were attached under the Benami Act.
Story first published: Tuesday, November 5, 2019, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X