For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయపు పన్ను అలర్ట్: ITR, ఆడిట్ రిపోర్టుకు చివరి తేదీ అక్టోబర్ 31

|

మీరు పన్ను చెల్లింపుదారాలా? అయితే మీకో గమనిక. ఆదాయపు పన్ను రిటరన్స్ ఫైలింగ్ గడువు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ 31వ తేదీతో ఐటీఆర్ సమర్పించేందుకు డెడ్ లైన్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఫైలింగ్‌కు ముందు ఆడిట్ రిపోర్ట్ అవసరమయ్యే వారందరు గురువారంతో ఫైలింగ్ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇంతకుముందు ఈ డెడ్ లైన్ సెప్టెంబర్ 30వ తేదీగా ఉంది. అయితే ట్యాక్స్‌పేయర్స్ ఐటీఆర్ ఆడిట్ రిపోర్ట్ ఆలస్యం కావడంతో తేదీని పొడిగించాలనే విజ్ఞప్తులు రావడంతో ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ దీనిని మన్నించింది.

బంగారం కొంటున్నారా?: ఏ ఆభరణంపై ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసుకోండిబంగారం కొంటున్నారా?: ఏ ఆభరణంపై ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసుకోండి

అందుకే అక్టోబర్ 31 వరకు పొడిగింపు

అందుకే అక్టోబర్ 31 వరకు పొడిగింపు

ఐటీఆర్, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ తుది గడువును సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించాలని ట్యాక్స్ పేయర్స్ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్ల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, దీంతో ఐటీఆర్ ఫైలింగ్ మరియు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ తుది గడువును పెంచినట్లు గతంలో CBDT తెలిపింది.

ఐటీఆర్ రిపోర్టును పంపిస్తారు...

ఐటీఆర్ రిపోర్టును పంపిస్తారు...

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44AB కిందకు వచ్చే సంస్థలు దాఖలు చేసే ఐటీఆర్‌కు ఆడిట్ రిపోర్ట్ అవసరం. ఇందులో కంపెనీలు, పార్ట్‌నర్‌షిప్ కంపెనీలు, ప్రొప్రయిటర్‌షిప్ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల అకౌంట్లు ఫైలింగ్‌కు ముందే ఆడిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత CA లేదా ఆడిటర్ ఐటీఆర్ రిపోర్టును ఐటీ డిపార్టుమెంట్‌కు పంపిస్తారు. ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసేవారు కూడా ఈ పరిధిలోకి రావొచ్చు.

గడువు దాటితే పెనాల్టీ

గడువు దాటితే పెనాల్టీ

సెప్టెంబర్ 27వ తేదీన CBDT తన ప్రకటనలో... కొన్ని ప్రాంతాల్లో వరదలు సహా వివిధ కారణాల వల్ల ట్యాక్స్ పేయర్స్ కొంతమంది ఐటీఆర్ ఫైలింగ్, ఆడిటింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. గడువు పెంపు మళ్లీ ఉండదని స్పష్టం చేసింది. డెడ్ లైన్ దాటితే 234A సెక్షన్ ప్రకారం పెనాల్టీ చెల్లించాలని తెలిపింది. ఆడిట్ రిపోర్ట్, ఐటీఆర్ దాఖలు చేసేవారికి రేపటి లోగా గడువు ఉంది. ఆ తర్వాత పెనాల్టీ ఉంటుంది.

English summary

ఆదాయపు పన్ను అలర్ట్: ITR, ఆడిట్ రిపోర్టుకు చివరి తేదీ అక్టోబర్ 31 | Income Tax alert: Last date to do this work is October 31

If you are a taxpayer then this could be an important news for you. The last date for filing ITR (ITR) along with audit report is 31 October 2019.
Story first published: Wednesday, October 30, 2019, 15:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X