For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PPF Vs NPS: పీపీఎఫ్, ఎన్‍పీఎస్‍లో ఏది బెటర్.. ఎందులో ఎక్కువ రిటర్న్ వస్తుంది..?

|

పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు రాకూడదంటే ఏదైనా పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సిందే. అయితే చాలా మంది PPF లేదా NPS పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. అయితే ఇందులో పీపీఎఫ్ మంచిదా లేక ఎన్పీఎస్ మంచిదా అన్నదానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. PPF, NPS పథకాల్లో ఏది బెటరో చూద్దాం..

NPS అంటే ఏమిటి?

NPS అంటే ఏమిటి?

NPS (జాతీయ పెన్షన్ పథకం) అనేది అనేది సబ్‌స్క్రైబర్లకు వృద్ధాప్య భద్రతను అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ పథకం. ఇందులో పొదుపు చేసి 60 ఏళ్ల నిండిన తర్వాత 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా డబ్బు యాన్యుటీలుగా మారుతుంది. 75 ఏళ్ల వయస్సులో మొత్తం నిధులు లేదా కొంత తీసుకొనే ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. దీన్ని PFRDA నిర్వహిస్తుంది.

PPF అంటే ఏమిటి?

PPF అంటే ఏమిటి?

PPF అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకం, ఇది పదవీ విరమణ తర్వాత మెరుగైన జీవితాన్ని అందిస్తుంది. ఈ ఖాతాలో చేసిన కనిష్ఠంగా 500 పొదుపు చేయ్యొచ్చు. గరిష్ఠంగా 1.5 లక్షలు పొదుపు చేయ్యొచ్చు. పీపీఎఫ్ కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీని మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు.

NPS, PPF ఖాతాల మధ్య ప్రధాన తేడాలు

NPS, PPF ఖాతాల మధ్య ప్రధాన తేడాలు

PPF చాలా సురక్షితమైనది. రిస్క్ లేనిది, ఎందుకంటే ఇది ప్రభుత్వం నిర్దేశించిన ఫిక్స్‌డ్ రిటర్న్ స్కీమ్, అయితే NPS అనేది మార్కెట్‌కి రిటర్న్‌లపై ఆధారపడి ఉంటుంది.NPSలో పదవీ విరమణ తర్వాత 60% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 40% తో వార్షిక యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. PPFలో మెచ్యూరిటీ మొత్తానికి సంబంధించి ఎటువంటి పరిమితులు లేవు.

పన్ను మినహాయింపు

పన్ను మినహాయింపు

పీపీఎఫ్ లో వడ్డీ, మెచ్యూరిటీ మొత్తానికి పన్ను ఉండదు కాబట్టి PPF మంచి పన్ను ఆదా చేసే పెట్టుబడి. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపును అందిస్తుంది. అయితే సెక్షన్ 80CCD కింద NPS విషయంలో రూ. 2 లక్షల వరకు మొత్తం ప్రయోజనం ఉంటుంది. 2 లక్షలు దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.ఎన్‌ఆర్‌ఐలు ఎన్‌పిఎస్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు కానీ పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టలేరు.

English summary

PPF Vs NPS: పీపీఎఫ్, ఎన్‍పీఎస్‍లో ఏది బెటర్.. ఎందులో ఎక్కువ రిటర్న్ వస్తుంది..? | If you invest in PPF and NPS schemes, you will get more returns

PPF and NPS are useful post retirement schemes. But let's find out which one is better.
Story first published: Friday, November 11, 2022, 12:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X