For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనరాక్ రిపోర్ట్: హౌసింగ్ సేల్స్ జంప్, 64 శాతంతో హైదరాబాద్ టాప్

|

జనవరి-మార్చి కాలంలో దేశవ్యాప్తంగా హౌసింగ్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 29 శాతం వృద్ధి సాధించి 58,290గా నమోదు కావొచ్చునని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ అంచనా వేస్తోంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది సేల్స్ భారీగా పడిపోయాయి. అయితే 2020 రెండో అర్ధ సంవత్సరంలో ఆర్థిక రికవరీతో క్రమంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్యాలెండర్ ఏడాది మొదటి త్రైమాసికంలో మంచి వృద్ధి కనబరుస్తుందని అంచనా వేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు రియాల్టీని ప్రోత్సహించేందుకు స్టాంప్ డ్యూటీ కట్ వంటి వాటిని ప్రకటించాయి. సేల్స్ పెరగడానికి ఇది కూడా దోహదపడింది.

ఏడు నగరాల్లో వృద్ధి

ఏడు నగరాల్లో వృద్ధి

ఏడు ప్రధాన నగరాలలో ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు జవవరి-మార్చి కాలంలో మంచి వృద్ధిని కనబరచవచ్చునని పేర్కొంది. ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీలో కోత విధించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాయితీలు ఇవ్వడం ఇందుకు దోహదపడ్డాయని తెలిపింది. 2020 తొలి త్రైమాసికంలో ఏడు ప్రధాన నగరాలలో 45,200 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 58,290కి చేరుకోవచ్చునని అంచనా. మొత్తం అమ్మకాల్లో ముంబై, పుణె వాటా 53 శాతం ఉంటుందని పేర్కొంది.

ముంబైలో 46 శాతం జంప్

ముంబైలో 46 శాతం జంప్

ముంబైలో రిజిస్ట్రేషన్లు 2021లో భారీగా పెరిగాయి. జనవరి, ఫిబ్రవరి కాలంలో భారీగా పెరిగినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో హోమ్ సేల్స్ 46 శాతం పెరిగి 2021 జనవరి-మార్చి కాలంలో 20,350కి చేరుకోవచ్చునని అంచనా వేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 13,910 యూనిట్లు సేల్ అయ్యాయి. పుణేలోను 7200 యూనిట్ల నుండి 47 శాతం పెరిగి 10,550 యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేసింది.

హైదరాబాద్‌లో 64 శాతం జంప్

హైదరాబాద్‌లో 64 శాతం జంప్

హైదరాబాద్‌లో సేల్స్ గరిష్టంగా పెరుగుతాయని అనరాక్ అంచనా వేసింది. ఇక్కడ 64 శాతం పెరిగి 2680 నుండి 4400కు చేరుకుంటాయని, చెన్నైలో 30 శాతం పెరిగి 2190 నుండి 2850కి చేరుకుంటాయని, కోల్‌కతాలో 10 శాతం పెరిగి 2440 నుండి 2680కి, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో 8 శాతం వృద్ధి సాధించి 8150 నుండి 8790కి పెరుగుతాయని అంచనా వేసింది. బెంగళూరులో స్వల్ప పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంలో 8630 నుండి 8670కి చేరుకుంటుందని అంచనా.

English summary

అనరాక్ రిపోర్ట్: హౌసింగ్ సేల్స్ జంప్, 64 శాతంతో హైదరాబాద్ టాప్ | Housing sales to rise 29 percent in January to march

Housing sales are estimated to rise 29 per cent year-on-year during January-March at 58,290 units across seven major cities as demand recovered on low home loan interest rates and stamp duty cut by Maharashtra government, according to property consultant Anarock.
Story first published: Friday, March 26, 2021, 19:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X