వొడాఫోన్ కేసు: కెయిర్న్ ఆర్బిట్రేషన్ తీర్పు కోసం ప్రభుత్వం వెయిటింగ్
ఢిల్లీ: వొడాఫోన్ గ్రూప్‌కు అనుకూలంగా వచ్చిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు కెయిర్న్ ఎనర్జీ పన్ను విధానంలో వెలువడే తీర్పు కోసం ప్రభుత్వం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. రెట్రోస్పెక్టివ్ పన్నుల కింద రూ.10,247 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం పంపిన నోటీసులపై ఆర్బిట్రేషన్‌ను కెయిర్న్ ఎనర్జీ ఆశ్రయించింది. ఈ కేసులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే కెయిర్న్ ఎనర్జీకి రూ.7,600 కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆర్బీఐ కమిటీ 'కార్పోరేట్ ఓన్ బ్యాంకు'పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

హైకోర్టుకు ఏం చెప్పిందంటే
కెయిర్న్ కేసుకు సబంధించి ప్రభుత్వం ఇచ్చిన పన్ను నోటీసులను సమర్థిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే వొడాఫోన్ తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరుకుతుందని అంటున్నారు. కెయిర్న్ ఆర్బిట్రేషన్ తీర్పు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అప్పీల్ చేస్తుంది. వొడాఫోన్ ఆర్బిట్రేషన్ అంశానికి సంబంధించి అప్పీల్ చేయడంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గతవారం ఢిల్లీ హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

డిసెంబర్ వరకు సమయం
వొడాఫోన్ వివాదంలో అప్పీల్ కోసం డిసెంబర్ చివరి వరకు సమయం ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఇరవై రోజుల క్రితం చెప్పారు. రూ.20 కోట్లకు పైనా రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూప్‌కు అనుకూలంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అప్పీలుకు వెళ్ళాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు అప్పీలుకు వెళ్లదగినది అయితే మూడు నెలల సమయం ఉంటుందని, అంటే డిసెంబర్ చివరి వరకు సమయం ఉందన్నారు. ఆ లోపు నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఏమిటీ కేసు
2007లో భారత్‌లో టెలికం సేవలు అందిస్తున్న హచిసన్ ఈక్విటీలో 67 శాతం వాటాను వొడాఫోన్ రూ.1,100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. దీనికి టీడీఎస్ కింద రూ.11,000 కోట్లు చెల్లించాలని ఆదాయపన్ను శాఖ అప్పుడు నోటీసులు పంపించింది. వొడాఫోన్ ఈ మొత్తం చెల్లించకపోవడంతో జరిమానా, వడ్డీ రూ.20వేల కోట్లకు పెరిగింది. రూ.12వేల కోట్ల వడ్డీ, రూ.7,900 కోట్ల పెనాల్టీ ఉంది. 2012 జనవరిలో ఐటీ శాఖ డిమాండును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీంతో ఆ తర్వాత రెండు నెలలకు కేంద్ర ప్రభుత్వం పాత తేదీలతో వర్తించేలా చట్టాన్ని సవరించింది. వడ్డీ, అపరాధ రుసుముతో కలిపి రూ.22,100కోట్ల పన్ను నోటీసు పంపించింది.
వొడాఫోన్ గ్రూప్‌కు పన్ను చెల్లించాలని ఈ నోటీసులు పంపించింది. దీంతో 2014లో వొడాఫోన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇటీవల వొడాఫోన్‌కు ఊరట లభించింది. ఈ తీర్పు ప్రకారం కోర్టు ఖర్చుల్లో 60 శాతాన్ని భారత ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బిట్రేటర్ నియామకానికి అయిన 6వేల యూరోల వ్యయంలో సగం భరించాలి. రూ.75 కోట్లు చెల్లించవలసి రావొచ్చునని అంచనా.