ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్. స్కూటీ, బైక్స్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రేటు తగ్గింపుపై హింట్ ఇచ్చారు. మంగళవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII)తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టూవీలర్లపై జీఎస్టీ భారం తగ్గింపుపై స్పందించారు. అదే జరిగితే వీటి ధరలు కూడా కొంతమేరకు తగ్గనున్నాయి.

బైక్ లగ్జరీ వస్తువు కాదు.. హానికరమైనదీ కాదు
ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన వస్తువులు కాదని, అలా అని హానికర వస్తువులు కూడా కాదని, కాబట్టి జీఎస్టీ రేట్ల సవరింపుకు అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రేట్ల సవరణ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. లగ్జరీ ఉత్పత్తులు, హానికరమైన వస్తువు కానీ టూవీలర్లపై ఎక్కువ జీఎస్టీ రేటు సరికాదని అభిప్రాయపడ్డారు.

28 శాతం నుండి 18 శాతానికి..
ప్రస్తుతం టూ-వీలర్ల పైన అత్యధికంగా 28 శాతం పన్ను ఉంది. జీఎస్టీ రేట్లలో 28 శాతం అధికం. హయ్యెస్ట్ రేటు ఉంది. టూవీలర్లపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలని ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పరిశ్రమ వర్గాలు కోరాయి. దీనిపై ఆర్థికమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా పై-వ్యాఖ్యలు చేశారు. 150 సీసీ బైక్స్ పైన ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని, ఆ తర్వాత దశలవారీగా ఆయా విభాగాలపై జీఎస్టీలో కోత విధించాలని గత ఏడాది హీరో మోటో కార్ప్ ప్రభుత్వాన్ని కోరింది.

ఎంఎస్ఎంఈలకు మరింత సహకారం
గురువారం జీఎస్టీ కౌన్సిల్ 41వ భేటీ జరుగనుంది. వచ్చే నెల 19వ తేదీన 42వ సమావేశం జరగుతుంది. మరోవైపు రూ.3 లక్షల కోట్ల రుణ హామీ పథకంలో మార్పులు చేసి చిన్నవ్యాపారులకు మరింత ఆర్థిక సహకారాన్ని అందిస్తామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపినట్లు సీఐఐ వెల్లడించింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా ఎంఎస్ఎంఈలకు ఈ పథకాన్ని తెచ్చిన విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications