For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా చేస్తే పక్షపాతమే: అంగీకరించిన సుందర్ పిచాయ్, గూగుల్ కీలక నిర్ణయం

|

వర్ణవివక్షకు తావులేకుండా చూడాలని ప్రముఖ సెర్చింజన్ గూగుల్, ఈ కంపెనీ మాతృసంస్థ అల్పాబెట్ నిర్ణయించింది. 2025 నాటికి సంస్థ లీడర్‌షిప్ బాధ్యతల్లో 30 శాతాన్ని ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లేని వర్గాలకు కేటాయించాలని మంచి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటి వరకు ప్రాతినిథ్యం లేని వర్గాలకు కేటాయించాలని భావిస్తున్నామని అల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు.

అమితాబ్, అక్షయ్, ధోనీ, సచిన్‌కు సెగ!: చైనా వస్తువులు బహిష్కరిద్దాం... కానీ కండిషన్అమితాబ్, అక్షయ్, ధోనీ, సచిన్‌కు సెగ!: చైనా వస్తువులు బహిష్కరిద్దాం... కానీ కండిషన్

అప్రమత్తమైన గూగుల్

అప్రమత్తమైన గూగుల్

అమెరికాలో నల్లజాతీయులు పోలీసుల చేతిలో హతమైన నేపథ్యంలో గూగుల్ సహా వివిధ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో గూగుల్ అప్రమత్తమైంది. ప్రస్తుతం గూగుల్ లీడర్‌షిప్ బాధ్యతల్లో 96 శాతం మంది తెల్లజాతీయులు, ఆసియా వ్యక్తులు ఉన్నారు. ఇందులో 73 శాతం మంది పురుషులు. అంతర్గత పదోన్నతులతో పాటు బయటి సంస్థల నుండి కూడా ఎంపిక చేసిన వారికి గూగుల్‌లో నాయకత్వ బాధ్యతలు ప్రస్తుతం వస్తున్నాయి. వర్ణ వివక్షను దూరం పెట్టే విధానాలు కూడా అవలంభిస్తామని సుందప్ పిచాయ్ స్పష్టం చేశారు.

30 శాతం అవకాశం

30 శాతం అవకాశం

2025 నాటికి కంపెనీలో ప్రాతినిథ్యం లేని వారికి 30 శాతానికి పైగా అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సిలికాన్ వ్యాలీ కంపెనీలు తరుచూ సీక్రెటింగ్ రిక్రూట్మెంట్స్, అంతర్గత ప్రమోషన్ల ద్వారా నియమించుకుంటాయి. దీంతో అవకాశాలు బయటి వారికి తెలియకుండా పోతున్నాయి. అన్ని లీడర్‌షిప్స్‌ను ఓపెన్‌గా ఎంచుకుంటాయని తెలిపారు.

అలా చేస్తే పక్షపాతమే.. బ్లాక్స్‌కు ఇలా సాయం

అలా చేస్తే పక్షపాతమే.. బ్లాక్స్‌కు ఇలా సాయం

అలాగే జాతిపరమైన ప్రొఫైలింగ్‌కు దారితీసే కార్యాలయ భద్రతా విధానాన్ని తొలగిస్తామని సుందర్ పిచాయ్ చెప్పారు. పలు కంపెనీల్లో బ్లాక్ ఉద్యోగులను అన్యాయంగా తనిఖీ చేయడం జరుగుతుందని చెబుతున్నారు. ఇది పక్షపాతమే అవుతుందని సుందర్ పిచాయ్ అంగీకరించారు. అలాగే బ్లాక్ బిజినెస్ ఓనర్స్‌కు 150 మిలియన్ డాలర్లు ప్రకటించారు పిచాయ్. బ్లాక్ వినియోగదారులకు సహాయపడే ప్రాజెక్టుపై పని చేసేందుకు అంతర్గాత టాస్కుఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

English summary

అలా చేస్తే పక్షపాతమే: అంగీకరించిన సుందర్ పిచాయ్, గూగుల్ కీలక నిర్ణయం | Google sets 2025 goal for leadership diversity, curbs on racial profiling

Alphabet Inc’s Google on Wednesday announced a new hiring goal and security policy to address racial issues at its offices, as protests over police brutality against African Americans have carried into discussions about corporate culture.
Story first published: Friday, June 19, 2020, 17:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X