For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold rate today: మళ్లీ రూ.48,000 దాటిన బంగారం ధరలు

|

2021 ఏడాది చివరలో బంగారం ధరలు 1800 డాలర్ల వద్ద తీవ్ర నిరోధకస్థాయిని ఎదుర్కొంటున్నాయి. గత మూడు సెషన్‌లలో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు, నేటి సెషన్‌లో మాత్రం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (డిసెంబర్ 23, గురువారం) ప్రారంభ సెషన్‌లో రూ.46 పెరిగి రూ.48,245 వద్ద, ఏప్రిల్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72 ఎగిసి రూ.48,345 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు స్వల్పంగా పెరిగి 1800 డాలర్ల పైకి చేరుకుంది. ఈ వార్త రాసే సమయానికి దాదాపు 5 డాలర్లు లాభపడి 1807 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఏడాదిలో 4.33 శాతం తగ్గింది.

స్వల్ప పెరుగుదల

స్వల్ప పెరుగుదల

యూఎస్ డాలర్ నేడు స్వల్పంగా క్షీణించడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరగడం, వివిధ దేశాల్లో లాక్ డౌన్ భయాందోళనలు కనిపిస్తున్నాయి. అయితే డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

ఈ మేరకు సౌతాఫ్రికన్ స్టడీ కూడా వెల్లడించింది. గత కొంతకాలంగా ఆర్థిక రికవరీ నేపథ్యంలో గోల్డ్ డిమాండ్ పెరుగుతోందని, అదే సమయంలో ఇటీవల ధరలు కూడా పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ఒమిక్రాన్ వెలుగు చూసినప్పటి నుండి బంగారం ధర భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్లీ స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది.

బంగారం మద్దతు ధర

బంగారం మద్దతు ధర

కామెక్స్‌లో గోల్డ్ మద్దతు ధర 1790 డాలర్లు. నిరోధకస్థాయి 1833 డాలర్లు. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫిబ్రవరి మద్దతు ధర రూ.47,900, నిరోధకస్థాయి రూ.48,500గా బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా పెరిగి 1807 డాలర్లను తాకింది. గోల్డ్ ఫ్యూచర్ 1808 డాలర్లకు చేరువైంది.

రూ.62,000 పైకి వెండి

రూ.62,000 పైకి వెండి

దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.162 పెరిగి రూ.62,350 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.212 ఎగిసి రూ.62,990 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.079 డాలర్లు లాభపడి 22.898 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో సిల్వర్ ఫ్యూచర్ 12 శాతం మేర తగ్గింది.

English summary

Gold rate today: మళ్లీ రూ.48,000 దాటిన బంగారం ధరలు | Gold rate today: Yellow metal tops Rs 48,300 on weaker dollar

Gold prices edged higher on Thursday on a weaker US dollar. Although, renewed risk appetite fuelled by an encouraging Omicron study and increased optimism around the global economic outlook kept gains in check.
Story first published: Thursday, December 23, 2021, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X