For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: నేడు బంగారం ధరల్లో క్షీణత.. హైదరాబాద్లో నేడు బంగారం ధరెంతంటే!!

|

చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం బంగారం గత రికార్డులను బ్రేక్ చేస్తూ 60 వేలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న తీరు బంగారం కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు అప్పుడప్పుడు కొద్దిగా ఉపశమనాన్ని కూడా కలిగిస్తున్నాయి.

నేడు హైదరాబాద్ లో బంగారం ధరలిలా

నేడు హైదరాబాద్ లో బంగారం ధరలిలా

ఇక ఈరోజు బంగారం ధరలను చూస్తే భారతదేశంలో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 51 వేల 450 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,130 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. నిన్నటి కంటే కాస్త బంగారం ధరలలో క్షీణత కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలను చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 51,450 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 51,600గా నమోదయింది. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలలో 150 రూపాయల క్షీణత కనిపిస్తుంది.

జనవరి 1 నుండి నేటి వరకు బంగారం ధరలలో పెరుగుదల .. నేడే కాస్త క్షీణత

జనవరి 1 నుండి నేటి వరకు బంగారం ధరలలో పెరుగుదల .. నేడే కాస్త క్షీణత

ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు ఈ సమయానికి 56,130 రూపాయలుగా ఉంది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,290 రూపాయలుగా నమోదయింది. నిన్నటికి ఈరోజుకి 24 క్యారెట్ల బంగారం ధరలో 160 రూపాయల మేర తగ్గుదల కనిపిస్తుంది. బంగారం ధర పెరిగితే 300 రూపాయలు, ఆపైన పెరుగుతుండగా.. తగ్గితే మాత్రం రెండు వందల రూపాయల లోపే తగ్గడం ప్రధానంగా గమనించాల్సిన అంశం. జనవరి 1వ తేదీన 50 వేల 600 రూపాయలు 22 క్యారెట్ల బంగారానికి హైదరాబాదులో ధర నమోదు కాగా జనవరి 10వ తేదీ నాటికి 51,450 ధర వద్ద బంగారం ట్రేడ్ అవుతుంది. అంటే మొత్తంగా ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు ఒకటి రెండు సందర్భాలు మినహాయించి బంగారం ధర పెరుగుతూనే ఉంది.

 దేశ రాజధాని ఢిల్లీలో క్షీణించిన బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో క్షీణించిన బంగారం ధరలు

ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర నేడు ఈ సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 51 వేల 600 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 51 వేల 750 రూపాయలుగా ఉంది. ఈరోజు 150 రూపాయలు మేర ఢిల్లీలో బంగారం ధర క్షీణించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో నేడు ఈ సమయానికి 56,290 రూపాయలుగా ఉంది. నిన్న 56,440 ఉన్న బంగారం ధర 160 రూపాయల తగ్గుదలను నమోదు చేసింది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో బంగారం ధరలిలా

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో బంగారం ధరలిలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి నేడు 51,450 రూపాయలుగా నమోదయింది. నిన్న ధర చూస్తే 51,600గా ఉంది. ముంబైలో ఉన్న 150 రూపాయలు మేర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర క్షీణించింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే నేడు ముంబైలో ఈ సమయానికి 56,130 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న 56,290 రూపాయలుగా బంగారం ధర పలికింది. మొత్తంగా 160 రూపాయల మేర బంగారం ధర తగ్గుదలను నమోదు చేసింది. బంగారం తగ్గినప్పుడు కొద్దిగా, పెరుగుతున్నప్పుడు భారీగా పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం మాత్రం భారీ రికార్డును సృష్టిస్తుందన్నది నిపుణుల అంచనా.

English summary

Gold price today: నేడు బంగారం ధరల్లో క్షీణత.. హైదరాబాద్లో నేడు బంగారం ధరెంతంటే!! | Gold price today: Relief in Gold prices today.. this is the gold price in Hyderabad today!

Gold prices have gave small relief today. Apart from Hyderabad, the gold prices in Delhi and Mumbai have reduced today. Find out how much gold price is in main cities today.
Story first published: Wednesday, January 11, 2023, 8:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X