For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో బంగారం ధరలిలా!!

భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గాయి. నేడు బంగారం ధరలు క్షీణించాయి. హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లో తగ్గిన బంగారం ధరలిలా ఉన్నాయి.

|

తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతున్న బంగారం ధరలు అప్పుడప్పుడు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. గత కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త క్షీణించాయి. ప్రస్తుతం రెండేళ్ల గరిష్టం పైన ట్రేడ్ అవుతున్న బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం వెండి ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా కాస్త బంగారం ధరలలో క్షీణత కనిపించింది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినా దేశీయంగా కాస్త రిలాక్స్

అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినా దేశీయంగా కాస్త రిలాక్స్

ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1927 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్ కు 23.70 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయినప్పటికీ తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది . ఇక దేశంలో బంగారం ధరల విషయానికొస్తే భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,500గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిన్న ఈ ధర 52,650 గా ఉంది. 150 రూపాయలు మేర 22 క్యారెట్ల బంగారం పై ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,270 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిన్న ఈ ధర 57,440 కాగా, ప్రస్తుతం 170 రూపాయలు తగ్గి ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో బంగారం ధరలు ఇలా

ఇక దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 52,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 57 వేల 270 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో 52,650 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దేశ రాజధాని ఢిల్లీలో 57,430 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది.

ముంబై, చెన్నై, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా

ముంబై, చెన్నై, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,500 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,270 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,550గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,330 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 53,380 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 58,230 రూపాయలుగా ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఉంది.

రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. ఎప్పుడైనా కాస్త ధరల ఉపశమనం

రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. ఎప్పుడైనా కాస్త ధరల ఉపశమనం

మొత్తంగా చూస్తే రికార్డు స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా మాత్రం కొద్దిగా బంగారం ధరలు తగ్గి బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. బంగారం ధరల మధ్య ఊగిసలాట కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఏది ఏమైనా కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు మాత్రం సామాన్య మధ్య ప్రజలకు బంగారం కొనుగోలు చేయలేమన్న భావనను కలిగిస్తున్నాయి.

English summary

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో బంగారం ధరలిలా!! | Gold price today: Good news for gold lovers: Reduced Gold prices in hyderabad!!

The situation of falling gold prices gives some relief to the buyers. Gold prices have declined a bit today. Apart from Hyderabad, gold prices are high in major cities.
Story first published: Wednesday, February 1, 2023, 7:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X