For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?

మళ్ళీ పెరిగిన బంగారం ధరలతో బంగారం ధరల దూకుడు కొనసాగుతుందన్న భావన కలుగుతుంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు అనేక ప్రధాన నగరాలలో నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

|

ఇప్పుడు భారతదేశంలో మహిళలు బంగారం ధరల పెరుగుదల విషయంలో తెగ బాధపడుతున్నారు. బంగారం కొనుగోలు మీద పిచ్చిగా వ్యామోహం ఉండే భారత దేశంలోని మహిళలు ఏ చిన్న సందర్భం అయినా సరే బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. పండుగలు, పబ్బాలు, వివాహాది శుభకార్యాలు ఏవైనా సరే బంగారం ఉండాల్సిందే. అంతగా బంగారంతో అనుబంధాన్ని పెనవేసుకున్న భారతీయులు ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో బంగారాన్ని కొనుగోలు చేయడానికి సతమతం అవుతున్నారు.

పసిడి ప్రియులకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్న బంగారం ధరలు

పసిడి ప్రియులకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్న బంగారం ధరలు

కాస్త తగ్గాయని భావించి కొద్దిగా రిలాక్స్ అవుతున్న తరుణంలోనే మళ్లీ మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్న తీరు పసిడి ప్రియులకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. ఇక తాజాగా మొన్న రెండు రోజులపాటు కాస్త క్షీణించిన బంగారం ధరలు మళ్లీ కొద్దిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ ప్రతికూల పరిస్థితులు నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయి చేరిన బంగారం ధరలతో పసిడి ప్రియులు బంగారం కొనుగోలు పై సందిగ్ధంలో ఉన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభం నుండీ కొనసాగుతున్న ధరల దూకుడు

ఈ సంవత్సరం ప్రారంభం నుండీ కొనసాగుతున్న ధరల దూకుడు

ఈ సంవత్సరం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు బంగారం ధరల సరళి బంగారం ధరలు మరింతగా పెరుగుతాయి అన్న సంకేతాలను ఇస్తున్నాయి. త్వరలో బంగారం 60 వేల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు 1927 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 23. 70 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 81.603 వద్ద స్థిరంగా ఉంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగానే కాకుండా దేశీయం గానూ బంగారం ధరల విషయానికి వస్తే భారతదేశంలోని ప్రధాన నగరాలలో ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్, ఢిల్లీలలో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్, ఢిల్లీలలో బంగారం ధరలు ఇలా

హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 52,650 రూపాయలుగా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్లో 57,440గా ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,800 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 57,990 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది.

ముంబై, బెంగళూరు, చెన్నైలలో బంగారం ధరలు ఇలా

ముంబై, బెంగళూరు, చెన్నైలలో బంగారం ధరలు ఇలా

ఇక ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,650 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 57,440 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు 52,700గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 57,490 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. బంగారం ధరల్లో ఎప్పుడు గరిష్ట ధరలను నమోదు చేసే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 53,500గా ప్రస్తుతం కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో 58, 370 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

English summary

Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా? | Gold price today: Alert for gold lovers.. These are the Latest gold prices If you Want to buy?

Gold prices have decreased a bit and then increased again, giving a feeling that we will not be able to buy them. Today, gold prices are like this in Hyderabad as well as in many major cities of the country
Story first published: Monday, January 30, 2023, 8:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X