For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోబల్ ఐటీ స్పెండింగ్స్ 4.3 ట్రిలియన్ డాలర్లకు, ఇండియాలో 7.3 శాతం వృద్ధి

|

దేశంలో ఐటీ వ్యయాలు ఈ ఏడాది 7.3 శాతం పెరిగి 9300 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చునని పరిశోధన సంస్థ గార్డ్‌నర్ అంచనా వేసింది. భారత కరెన్సీలో ఇది రూ.6.97 లక్షల కోట్లు. అయినప్పటికీ ఇది ప్రపంచ సగటు వృద్ధి 8.4 శాతం (4.3 ట్రిలియన్ డాలర్లు) కంటే తక్కువ అని వెల్లడించింది. 2022లో ఇది 9850 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చునని పేర్కొంది. రాబోయే కాలంలో ఐటీ వ్యయాలు కార్పోరేట్ మద్దతు కార్యకలాపాలకే కాకుండా వ్యాపార విలువ జోడింపు బిజినెస్‌కు కూడా విస్తరిస్తాయని తెలిపింది.

విభాగాలవారీగా చూస్తే డేటా సెంటర్ సిస్టమ్స్ 4.3 శాతంతో 350 కోట్ల డాలర్లు, ఎంటర్‌ప్రైజ్ సాఫ్టువేర్ విభాగం 13.3 శాతంతో 770 కోట్ల డాలర్లు, డివైజ్‌లు 7.7 శాతంతో 346 కోట్ల డాలర్లు, కమ్యూనికేషన్ సర్వీస్‌లు 4.9 శాతంతో 301 కోట్ల డాలర్ల వృద్ధిని నమోదు చేయవచ్చునని తెలిపింది. గ్లోబల్ ఐటీ స్పెండింగ్స్ 2022లో 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని గార్ట్‌నర్ పేర్కొంది.

 Global IT spending to reach USD 4.3 trillion in 2022

కరోనా కారణంగా గత ఏడాది కాలంగా అన్ని రంగాల వృద్ధి భారీగా క్షీణించింది. కరోనా ప్రభావం తక్కువగా పడిన రంగం, అలాగే వేగంగా కోలుకున్న రంగం ఐటీ. మిగతా రంగాలతో పోలిస్తే ఐటీ రంగం వేగంగా పుంజుకుంది.

English summary

గ్లోబల్ ఐటీ స్పెండింగ్స్ 4.3 ట్రిలియన్ డాలర్లకు, ఇండియాలో 7.3 శాతం వృద్ధి | Global IT spending to reach USD 4.3 trillion in 2022

Even businesses that have weathered the pandemic so far with aplomb are being cautious about their long-term investments, as economic conditions remain fluid and uncertainty looms over when workers will start returning to the office in large numbers.
Story first published: Thursday, April 8, 2021, 16:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X