For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FY21లో జీడీపీ 9.5% ప్రతికూలత, నాలుగో క్వార్టర్‌కు పాజిటివ్: RBI గవర్నర్

|

ముంబై: 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 9.5 శాతం మేర క్షీణించవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అక్టోబర్ 7వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఆర్బీఐ MPC భేటీ అయింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను దాస్ మీడియాకు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో వృద్ధి రేటు 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. నాలుగో క్వార్టర్ నాటికి జీడీపీ పాజిటివ్‌గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా నేపథ్యంలో నిన్నటి వరకు ఉన్న మానసిక భయం, నిరాశ నుండి ఆశ వైపు వెళ్తోందని శక్తికాంతదాస్ అన్నారు. నాలుగో త్రైమాసికం నాటికి ద్రవ్యోల్భణం లక్ష్యానికి చేరువగా ఉంటుందన్నారు. జీడీపీ వృద్ధి రేటు నాలుగో క్వార్టర్ నాటికి సానుకూలంగా ఉండవచ్చునన్నారు. వివిధ రంగాలు ఆర్థికంగా వేగంగా కోలుకుంటున్నాయన్నారు.

వడ్డీరేటు 4%, వడ్డీ రేట్లు యథాతథం: RBI గవర్నర్ శక్తికాంతదాస్వడ్డీరేటు 4%, వడ్డీ రేట్లు యథాతథం: RBI గవర్నర్ శక్తికాంతదాస్

GDP to decline by 9.5 percent for FY21, RBI

వ్యవసాయం, వినియోగ వస్తువులు, పవర్, ఫార్మా రంగాలు చాలా వేగంగా రికవరీ అవుతున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.5 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని అంచనా వేశారు. సెప్టెంబర్ నెలలో పీఎంఐ 56.9 శాతానికి పెరిగిందన్నారు. జనవరి 2012 నుండి ఇది గరిష్టం.

English summary

FY21లో జీడీపీ 9.5% ప్రతికూలత, నాలుగో క్వార్టర్‌కు పాజిటివ్: RBI గవర్నర్ | GDP to decline by 9.5 percent for FY21, RBI

The RBI sees FY21 GDP contracting by 9.5 per cent although GDP growth may turn positive in Q4FY21, RBI Governor Shaktikanta Das said.
Story first published: Friday, October 9, 2020, 11:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X