For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్‌కు మరో షాక్, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు.. ఏమవుతుందంటే?

|

భారతీ ఎయిర్‌టెల్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఎక్స్‌పోర్ట్ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా లేదనే ఆరోపణలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ దీనిని బ్లాక్ లిస్టులో పెట్టింది. దీనిని డెనీడ్ ఎంట్రీ లిస్ట్‌లో చేర్చింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎగుమతుల ప్రోత్సాహకాల పథకాల స్కీం కింద ఎగుమతి నిబంధనలను నెరవేర్చకపోవడంతో విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ ఈ జాబితాలో చేర్చింది.

కస్టమర్లకు హెచ్చరిక! దేశవ్యాప్తంగా రెండ్రోజులు బ్యాంకుల సమ్మెకస్టమర్లకు హెచ్చరిక! దేశవ్యాప్తంగా రెండ్రోజులు బ్యాంకుల సమ్మె

తిరస్కరించిన ఎంట్రీ జాబితాలో..

తిరస్కరించిన ఎంట్రీ జాబితాలో..

ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం (EPCG) కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడంలో ఎయిర్‌టెల్ విఫలమైనట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ను తిరస్కరించిన ఎంట్రీ జాబితాలో చేర్చినట్లు తెలిపారు.

ఈ జాబితాలో చేర్చితే ఏమవుతుందంటే

ఈ జాబితాలో చేర్చితే ఏమవుతుందంటే

డెనీడ్ ఎంట్రీ లిస్టులో చేర్చితే దిగుమతి లైసెన్స్ కోల్పోతుంది. అవసరం లేని కారణంగా 2018 ఏప్రిల్ నుంచి తాము అలాంటి లైసెన్స్ తీసుకోలేదని ఎయిర్ టెల్ చెబుతోంది. అంతకుముందు లైసెన్స్‌లు అన్నీ క్లోజ్ అయిన నేపథ్యంలో కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.

ఈపీసీజీ కింద సుంకం లేకుండా దిగుమతి

ఈపీసీజీ కింద సుంకం లేకుండా దిగుమతి

ఈ లైసెన్స్‌లో భాగంగా ఏ వస్తువులు ఎగుమతి లేదా దిగుమతి లైసెన్స్ కిందకు వస్తుందో వెల్లడించలేదు. EPCG స్కీం కింద ఎగుమతిదారు కొంత వరకు క్యాపిటల్ గూడ్స్‌ను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. ఎగుమతులకు సంబంధించిన ప్రక్రియలో టెక్నాలజీని పెంచుకోవడం కోసం అవసరమైన మాన్యుఫ్యాక్చరింగ్ గూడ్స్, సేవలను దిగుమతి చేసుకోవచ్చు.

English summary

ఎయిర్‌టెల్‌కు మరో షాక్, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు.. ఏమవుతుందంటే? | Foreign Trade Regulator Puts Airtel On Denied Entry List

The Director General of Foreign Trade has blacklisted telecom operator Bharti Airtel on the grounds of not meeting the export obligations and has put it on Denied Entry List, official sources said.
Story first published: Wednesday, January 29, 2020, 14:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X