For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నూనె ధరలు ప్రభావం, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయ్!

|

నిత్యావసర వస్తువుల ధరలు త్వరలో పెరగనున్నాయా? సామాన్యుడి జేబుకు చిల్లు పడనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(FMCG) కంపెనీలు. అంటే వినియోగదారులు తమ రోజువారీ ఉత్పత్తుల కోసం త్వరలో ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితులు రావొచ్చు. ఇందుకు ప్రధాన కారణం ఎఫ్ఎంసీజీ కంపెనీలు కీలకమైన ముడి పదార్థాల ఇన్‌పుట్‌పై ద్రవ్యోల్భణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ భారం తగ్గించుకునే ఉద్దేశ్యంతో కంపెనీలు ఉత్పత్తుల ధరలు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నాయి.

వేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువవేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువ

ధరలు త్వరలో పెంచవచ్చు

ధరలు త్వరలో పెంచవచ్చు

మెరికో, ఇతర కొన్ని ఎఫ్ఎంసీజీ సంస్థలు ఇప్పటికే ధరల పెంపు దిశగా వెళ్లగా, ఇప్పుడు డాబుర్, పార్లె, పతంజలి వంటి కంపెనీలు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయి. కొబ్బరి నూనె, తినదగిన నూనె, పామాయిల్ వంటి ముడి పదార్థాల ఇన్‌పుట్ ధరల పెరుగుదలను వినియోగదారుల నుండి వసూలు చేసేందుు FMCG కంపెనీలు ఆలోచన చేస్తున్నాయి. అయితే కంపెనీలు ఎక్కువ కాలం వేచి చూసే అవకాశం లేదు. మరింత కాలం వేచి చూస్తే వారి స్థూల మార్జిన్‌లను ప్రభావం పడుతుంది. కాబట్టి ధరలు త్వరలో పెంచవచ్చు.

ధరలు పెంచే ఛాన్స్

ధరలు పెంచే ఛాన్స్

గత మూడు, నాలుగు నెలల్లో ఇన్‌పుట్ ఖర్చు, ముఖ్యంగా వంట నూనెలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని, ఇది తమ మార్జిన్స్, ఖర్చులపై ప్రభావం చూపుతోందని, ప్రస్తుతానికి, తాము ఎలాంటి ధరల పెరుగుదల నిర్ణయం తీసుకోలేదని, కాని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితి ఇలాగే ఉంటే ధరల పెరుగుదల ఉండవచ్చునని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా అన్నారు. ఎడిబుల్ ఆయిల్ అన్ని ఉత్పత్తులకు ఉపయోగిస్తామని, ఇది 4 శాతం నుండి 5 శాతం వరకు పెరగవచ్చునని చెప్పారు. దాబూర్ ఇండియా సీఎఫ్ఓ లలిత్ మాలిక్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

పతంజలి వెయిట్ అండ్ వాచ్ కానీ..

పతంజలి వెయిట్ అండ్ వాచ్ కానీ..

హరిద్వార ప్రధాన కార్యాలయం కలిగిన పతంజలి వెయిట్ అండ్ వాచ్ అంటోంది. పరిస్థితులను గమనిస్తున్నామని, అందుకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని పతంజలి ఆయుర్వేద తెలిపింది. తద్వారా ధరల పెంపు ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. సఫోలా, ప్యారాచూట్ ఉత్పత్తులు అందించే మారికో ఇప్పటికే ధరల పెంపుకు వెళ్లింది.

English summary

నూనె ధరలు ప్రభావం, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయ్! | FMCG companies look to hike prices to offset inflationary pressure on raw material inputs

Consumers may have to shell out more money for their daily use products as FMCG firms, which are facing inflationary pressure on their key raw material inputs, are considering marginal hike on their products price to offset it.
Story first published: Monday, January 11, 2021, 14:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X