For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Farmer: రైతన్నపై వంకాయ బాంబు..! పంట అమ్మితే ఇంత దారుణమా..? అయ్యో..

|

Farmer: రైతుల పరిస్థితి దిగజారుతోందనే వార్తలు రోజూ మీడియాలో సర్వసాధారణంగా వింటూనే ఉన్నాం. కానీ అవి ఎంత దారుణంగా ఉన్నాయో.. వాస్తవ పరిస్థితులను చూస్తేనే గానీ మనకు అర్థంకాదు. అచ్చం అలాంటి సంఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. అసలు ఏం జరిగిందంటే..

పంట లాభమా..? నష్టమా..?

పంట లాభమా..? నష్టమా..?

పంట పూర్తిగా చేతికొచ్చినా.. దానికి కనీసం సరైన గిట్టుబాటు ధర లభిస్తేనే ఉపయోగం. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున కూరగాయల నుంచి అన్ని ఆహార పదార్థాల ధరలు ప్రజలకు అందుబాటులో లేనంత స్థాయికి చేరుకున్నాయి. రైతులకు ఈ సమయంలో పండించిన కూరగాయలను అమ్ముకోవటం కూడా కష్టతరంగా మారిపోయింది. వంకాయలు పండించిన ఒక రైతు దానిని అమ్ముకోవటానికి వెళితే ఎదురైన చేదు అనుభవం గురించి తెరపైకి వచ్చిన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంత ఘోరం..

ఎంత ఘోరం..

ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లా, మహాసముంద్‌కు చెందిన ఒక రైతుకు చేదు అనుభం ఎదురైంది. అతను పండించిన 1485 కిలోల వంకాయను రాయ్‌పూర్‌లోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు పంపాడు. ఈ క్రమంలో మొత్తం వంకాయలను రూ.2,475కు విక్రయించారు. రూ.2,200 సరుకు, రూ.198 హమాలీ, రూ.198 కమీషన్ కలిపుకుని అతడికి రూ.2,596 బిల్లును కూరగాయల వ్యాపారి రైతుకు అందజేశారు.

ఇక్కడ సదరు రైతు ఆదాయం కంటే వచ్చిన బిల్లు ఎక్కువ. దీంతో కూరగాయలు అమ్ముకున్న అతడు లాభం పొందాల్సింది పోగా తన జేబు నుంచే రూ.121 ఎదురు చెల్లించుకోవాల్సి వచ్చింది. మార్కెట్‌లో డిమాండ్‌కు మించి కూరగాయలు వస్తుండటంతో ధరలు దొరకడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అలా అతనికి మైనస్ బిల్లింగ్ వచ్చింది.

రైతుల అతలాకుతలం..

రైతుల అతలాకుతలం..

పండించిన పంటకు వస్తున్న ధర కంటే దానికోసం అవుతున్న ఖర్చులు ఎక్కువగా ఉండటం రైతులను అతలాకుతలం చేస్తోంది. దుర్గ్‌, రాయనంద్‌గావ్‌, రాయ్‌పూర్‌ నుంచి బస్తర్‌ వరకు కూరగాయల సాగుదారులు తమ ఉత్పత్తులకు అయ్యే ఖర్చును భరించలేక ఆందోళన చెందుతున్నారు. డిమాండ్‌ కంటే తక్కువ కూరగాయలు ఉన్నా గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు.

దీంతో కూరగాయల ధరలను మార్కెట్‌లో ప్రదర్శించాలని రైతులు అంటున్నారు. గిరాకీ ఉన్నా గత నెలన్నర రోజులుగా కూరగాయల డిమాండ్ పెరుగుతున్నా.. వాటి ధరలు మాత్రం తగ్గుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితులపై ప్రభుత్వాలు స్పందించాలని వారు కోరుతున్నారు. రైతులకు సహాయక చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టమోటా సంక్షోభం..

టమోటా సంక్షోభం..

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా టమోటా పంట వేగంగా రైతుల చేతికి వస్తోంది. ఈ కారణంగా మార్కెట్లోకి గత కొన్ని రోజులుగా వాటి రాక పెరిగింది. మండీల్లో కొనుగోలుదారులు అందుబాటులో లేకపోవడంతో రైతులు పండించిన టమాటాలను తీసి క్యారెట్లలో ఉంచి ప్రాసెసింగ్ ప్లాంట్లకు ఇస్తున్నారు. అయితే ప్లాంట్లకు వాహనాల్లో టమాటాలను తీసుకెళితే అవి అక్కడ దాదాపు 3 రోజులు నిలిచిపోతున్నాయని అద్దె భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలీఫ్లవర్, క్యాబేరీ వంటి పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉందని వారు అంటున్నారు.

English summary

Farmer: రైతన్నపై వంకాయ బాంబు..! పంట అమ్మితే ఇంత దారుణమా..? అయ్యో.. | Farmer in chhattisgarh got negative bill who sold vegetables in market

Farmer in chhattisgarh got negative bill who sold vegetables in market...
Story first published: Sunday, January 8, 2023, 13:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X