For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌లైన్స్ ఆపరేషన్స్ భారమే: పాసింజర్ టిక్కెట్, సోషల్ డిస్టెన్స్ ప్రభావం

|

కరోనా-లాక్ డౌన్ కారణంగా అన్ని ఎయిర్ లైన్స్ విమానాలు గ్రౌండ్‌కే పరిమితం అయ్యాయి. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు ప్రారంభించడానికి పెద్దమొత్తంలో నిధులు అవసరమట. ఇండిగో మినహాయించి మిగతా సంస్థలకు కనీసం 2.5 బిలియన్లు డాలర్లు సమీకరించాల్సి ఉంటుందని CAPA ఇండియా శుక్రవారం తన నివేదికలో పేర్కొంది.

ఇండిగో బాగున్నప్పటికీ..

ఇండిగో బాగున్నప్పటికీ..

ఇతర విమాయాన సంస్థలు మినహాయిస్తే ఇండిగో క్యాష్ రిజర్వ్స్ 1.13 బిలియన్ డాలర్ల క్యాష్, 1.33 బిలియన్ డాలర్ల రిస్ట్రిక్టెడ్ క్యాష్ ఉంది. ప్రస్తుతానికి ఇండిగా పరిస్థితి మిగతా వాటితో పోలిస్తే బాగుంది. కానీ దీర్ఘకాలం సంక్షోభం కొనసాగితే ఇండిగో కూడా ఇబ్బందుల్లోకి నెట్టబడుతుందని CAPA ఇండియా తెలిపింది.

ఆపరేషన్స్‌కే ఆ మొత్తం.. రికవరీకి మరింత

ఆపరేషన్స్‌కే ఆ మొత్తం.. రికవరీకి మరింత

లాక్ డౌన్ తర్వాత విమానయాన సంస్థలు తిరిగి ఆపరేషన్స్ ప్రారంభించడానికే 2.5 బిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేసింది. ఎయిర్ లైన్స్ రికవరీకి మరిన్ని పెద్ద మొత్తంలో నిధులు అవసరమని పేర్కొంది. కరోనా వల్ల ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. అయితే ఈ సంక్షోభం నుండి కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందనేది కూడా ప్రశ్నే అని అభిప్రాయపడింది.

ఇవి కూడా ఇబ్బందికరమే..

ఇవి కూడా ఇబ్బందికరమే..

ప్రయాణీకులు బుక్ చేసుకున్న టిక్కెట్లకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విమాయాన సంస్థలకు వ్యతిరేకంగా ఉంటే మరో 300 మిలియన్ డాలర్లు డొమెస్టిక్ రీఫండ్ కోసం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇది విమానయాన సంస్థలకు అతి పెద్ద సవాల్‌గా మారుతోంది. లాక్ డౌన్ ఎత్తివేశాక కూడా బిజినెస్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఉదాహరణకు 180 సీట్ల విమానంలో సామాజిక దూరం కారణంగా లేదా డిమాండ్ బలహీనంగా ఉంటే 108 సీట్లు నిండితే 60 శాతం మాత్రమే అవుతుంది.

English summary

ఎయిర్‌లైన్స్ ఆపరేషన్స్ భారమే: పాసింజర్ టిక్కెట్, సోషల్ డిస్టెన్స్ ప్రభావం | except Indigo all other airlines in big trouble to restart operations

Indian airlines, excluding market leader IndiGo, will need to raise a minimum of $2.5 billion to survive the grounding due to the lockdown imposed to contain covid-19 pandemic, aviation consultancy firm CAPA India said in a report on Friday.
Story first published: Saturday, May 2, 2020, 21:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X