For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జూలైలో ఈపీఎఫ్‌వోలో కొత్తగా నమోదైన ఉద్యోగాలు ఎన్ని అంటే

|

సంఘటిత రంగంలో ఈ ఏడాది జూలై నెలలో 8.45 లక్షల ఉద్యోగాలు నమోదయినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఇది ప్రస్తుతం ఊరట కలిగించే విషయం. ఈ ఏడాది జూన్ నెలలో నమోదైన కొత్త ఉద్యోగాలు 4.82 లక్షలుగా ఉంది. మొదట 6.55 లక్షలుగా ప్రకటించింది. తర్వాత సవరించింది. 2020 ఫిబ్రవరిలో నికర నియామకాలు 10.21 లక్షలుగా ఉండగా, మార్చి నెలలో 5.72 లక్షలకు పడిపోయాయి. ఇప్పుడు జూన్ మాసంలో 4,82,352 ఉండగా, జూలైలో 8.45 లక్షలుగా ఉండటం అంటే దాదాపు రెండింతలు పెరిగినట్లు. మార్చి నెల సమీపానికి వస్తోంది.

ఏటీఎంకు వెళ్తున్నారా.. ఈరోజు నుండి మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!ఏటీఎంకు వెళ్తున్నారా.. ఈరోజు నుండి మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!

సగటున నెలకు దాదాపు రూ.7 లక్షలు

సగటున నెలకు దాదాపు రూ.7 లక్షలు

తాజా డేటా ప్రకారం ఏప్రిల్ నెలలో మైనస్ 61,807తో నెగిటివ్ జోన్‌లో ఉండగా, 20,164 కొత్త సబ్‌స్క్రిప్షన్స్ చోటు చేసుకున్నాయి. అంటే కరోనా కారణంగా ఈపీఎఫ్ఓ పథకంలో చేరిన వారి కంటే నిష్క్రమించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. అంతకుముందు జూలై డేటా ప్రకారం ఈపీఎఫ్ఓ ఎన్‌రోల్‌మెంట్స్ ఏప్రిల్ నెలలో 1 లక్షగా చూపించింది. ఆగస్ట్ నెలలో దానిని 20,164కు సవరించారు. ఈపీఎఫ్ఓలో నికర కొత్త ఎన్‌రోల్‌మెంట్స్ ప్రతి నెల సగటున దాదాపు 7 లక్షలుగా ఉంటాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నికర కొత్త సబ్‌స్క్రైబర్ల సంఖ్య 78.58 లక్షలకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 61.12 లక్షలుగా ఉంది.

2017 సెప్టెంబర్ నుండి కొత్త సబ్‌స్రైబర్లు ఎంతమంది అంటే?

2017 సెప్టెంబర్ నుండి కొత్త సబ్‌స్రైబర్లు ఎంతమంది అంటే?

ఈపీఎఫ్ఓ కొత్త చందాదారుల పేరోల్ డేటాను ఏప్రిల్ 2018 నుండి విడుదల చేస్తోంది. అప్పుడు సెప్టెంబర్ 2017వ తేదీ నుండి రికార్డును వెల్లడించింది. డేటా ప్రకారం సెప్టెంబర్ 2017 నుండి జూలై 2020 మధ్య కొత్తగా చేరిన సబ్‌స్రైబర్లు 1.68 కోట్లుగా ఉన్నారు. ఉద్యోగుల రికార్డులను నవీనీకరించడం నిరంతర ప్రక్రియ. అందుకే కొన్ని సందర్భాల్లో సవరిస్తారు.

లాక్ డౌన్ నుండి..

లాక్ డౌన్ నుండి..

ప్రభుత్వం మార్చి 25, 2020వ తేదీ నుండి లాక్ డౌన్ అమలు చేసింది. దీంతో మార్చి ఈసీఆర్(పీఎఫ్ రిటర్న్స్) ఫైలింగ్ డేటా దాఖలు చేసే తేదీని మే 15వ తేదీకి పొడిగించింది. జూన్ నెలలో లాక్ డౌన్ దృష్ట్యా ఏప్రిల్ ఈసీఆర్ సబ్‌మిషన్ తేదీని పొడిగించింది. ఈపీఎఫ్ఓలో కొత్త ఉద్యోగాల ఎన్‌రోల్, నిష్క్రమించిన వారు, మళ్లీ చేరిన వారు ఉన్నారు.

English summary

జూలైలో ఈపీఎఫ్‌వోలో కొత్తగా నమోదైన ఉద్యోగాలు ఎన్ని అంటే | EPFO records 8.45 lakh new enrolments in July 2020

Provisional payroll data released by the EPFO last month had shown that net new enrolments stood at 6.55 lakh in June this year. The figure has now been revised down to 4,82,352.
Story first published: Monday, September 21, 2020, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X