For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్ ఇండియా విమానాలకు బ్రేక్ వేసిన దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ .. రీజన్ ఇదే !!

|

దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యొక్క అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది . నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ యొక్క నో-ఫ్రిల్ అనుబంధ సంస్థ-అక్టోబర్ 2 వరకు దుబాయ్ కు సర్వీసులను నడపరాదని పేర్కొంది . ఇండియన్ ఎయిర్ లైన్స్ దుబాయ్ కి కరోనా సోకిన ప్రయాణీకులను తీసుకెళ్లినట్లు తేలింది.

15 రోజులపాటు ఎయిర్ ఇండియా విమానాలకు బ్రేక్ వేసిన దుబాయ్ ఎమిరేట్స్

15 రోజులపాటు ఎయిర్ ఇండియా విమానాలకు బ్రేక్ వేసిన దుబాయ్ ఎమిరేట్స్

దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ దుబాయ్ లో ఎయిర్ లైన్స్ ఆపరేషన్ ను సెప్టెంబర్ 18 నుండి 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కోవిడ్ -19 సోకిన ప్రయాణీకుడిని రెండవ సారి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే ఒకసారి కోవిడ్ పాజిటివ్ ఉన్న ప్రయాణికుడిని తీసుకు వెళ్ళిన ఇండియన్ ఎయిర్ లైన్స్ రెండవ సారి కోవిడ్ -19 పాజిటివ్ ప్రయాణీకుడిని తీసుకువెళ్లటం , కరోనా నిబంధనలను పాటించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఈ నిర్ణయం తీసుకుంది .కరోనా పాజిటివ్ ఉన్న ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ తో జైపూర్ నుండి దుబాయ్ కు సెప్టెంబర్ 4వ తేదీన 7 ఇండియా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కరోనా పాజిటివ్ వ్యక్తిని తీసుకువెళ్ళిన ఎయిర్ ఇండియా విమానం .. నిబంధనల ఉల్లంఘన

కరోనా పాజిటివ్ వ్యక్తిని తీసుకువెళ్ళిన ఎయిర్ ఇండియా విమానం .. నిబంధనల ఉల్లంఘన

దుబాయ్ ఎమిరేట్‌లోని విమానాశ్రయాలకు సంబంధించిన నిర్దేశించిన విధానాలను , ప్రోటోకాల్‌లను ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని దుబాయ్ యొక్క ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది. దుబాయ్ విమానాశ్రయాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ యొక్క అన్ని ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని ,15 రోజుల వరకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిబంధనల ప్రకారం భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తన ప్రయాణానికి 96 గంటల ముందు చేసిన ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకొని కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలి. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కూడా తీసుకువెళ్లటమే ఈ నిర్ణయానికి కారణం .

ఎయిర్ ఇండియాపై ఖర్చుల భారం , వివరణ కోరిన దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధారిటీ

ఎయిర్ ఇండియాపై ఖర్చుల భారం , వివరణ కోరిన దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధారిటీ

ఎయిర్ ఇండియా సర్వీసులను నిలిపివేయడంతో పాటు, వైద్య సేవలకు , ఇతర ప్రయాణీకుల క్వారంటైన్ తో పాటు సంబంధిత ఇతర ఖర్చులకు డబ్బు చెల్లించమని పేర్కొంది. కొచ్చి ప్రధాన కార్యాలయ విమానయాన సంస్థ దుబాయ్‌కి తన విమానాలను తిరిగి ప్రారంభించాలంటే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించడానికి వివరణ కూడా ఇవ్వాలని కోరారు. సస్పెన్షన్ వ్యవధిలో ఎయిర్ లైన్స్ తన దుబాయ్ వెళ్ళే విమానాల సర్వీసులను షార్జాకు మళ్ళిస్తుందని సీనియర్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారి తెలిపారు.

Read more about: operations passengers air india
English summary

ఎయిర్ ఇండియా విమానాలకు బ్రేక్ వేసిన దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ .. రీజన్ ఇదే !! | Dubai Civil Aviation Authority suspended Air India flights for 15 days

Dubai Civil Aviation Authority has suspended all operations of Air India Express to operate across all airports in the country till 2 October after the airline was found to have carried covid-19 infected passengers.
Story first published: Friday, September 18, 2020, 18:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X