For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాకు ట్రంప్ మరో షాక్, ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొద్దు

|

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉండనున్నారు. ఈ సమయంలోను చైనా పట్ల ఆయన తీరు కఠినంగానే ఉంది. చైనా దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేస్తూ, డ్రాగన్ కంట్రీకి కొరకురాని కొయ్యలా మారారు ట్రంప్. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం చైనాకు సంతోషాన్ని ఇచ్చే విషయంగా చాలామంది భావిస్తున్నారు. అయితే చైనా దూకుడును అడ్డుకునేందుకు ట్రంప్ మార్గంలోనే గెలుపొందిన జోబిడెన్ కూడా నడవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా ట్రంప్ చైనాకు మరో షాకిచ్చారు.

 ఎకానమీ ఎఫెక్ట్: అదే లేకుంటే ట్రంప్ చాలా ఈజీగా గెలిచేవారా? ఎకానమీ ఎఫెక్ట్: అదే లేకుంటే ట్రంప్ చాలా ఈజీగా గెలిచేవారా?

అమెరికా సంస్థలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టకుండా

అమెరికా సంస్థలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టకుండా

చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)తో సంబంధాలు ఉన్నట్లు తేలిన కొన్ని కంపెనీలపై ఇప్పటికే ఆమెరికా ఆంక్షలు విధించింది. తాజాగా ఈ జాబితాలో మరో 31 కంపెనీలను చేర్చింది. ఈ కంపెనీలు పీఎల్ఏ ఆధ్వర్యంలో పని చేస్తున్నట్లు అమెరికా రక్షణ విభాగం ఆరోపిస్తోంది. ఆయా కంపెనీల్లో అమెరికన్ సంస్థలు లేదా వ్యక్తులు పెట్టుబడులు పెట్టడాన్ని, వాటాలు కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ గురువారం వైట్ హౌస్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీలు చైనా PLAకు సహకరిస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు.

అమెరికా నిధులను అలా ఉపయోగిస్తోంది..

అమెరికా నిధులను అలా ఉపయోగిస్తోంది..

యునైటెడ్ స్టేట్స్ మూలధనాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(PRC) తన వనరులకు, దాని సైనికఅభివృద్ధి, ఆధునికీకరణకు ఉపయోగించుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాజా నిర్ణయం జనవరి 11, 2021 నుండి అమలులోకి వస్తుంది. ఆయా కంపెనీల నుండి ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసేందుకు నవంబర్ 11, 2021 వరకు గడువు ఇచ్చారు. అమెరికన్లు, అమెరికా సంస్థలు ఈ కంపెనీల్లో పెట్టే పెట్టుబడులు లేదా వాటాల కొనుగోలు ద్వారా వచ్చే నిధులతో చైనా నేరుగా అమెరికాను సవాల్ చేస్తోందని అభిప్రాయపడింది. అమెరికా రక్షణ శాఖ గుర్తించిన 31 కంపెనీలను పేర్కొంది.

జాబితాలో ఈ కంపెనీలు

జాబితాలో ఈ కంపెనీలు

నిషేధించిన జాబితాలో చైనాకు చెందిన టెలికం కార్పోరేషన్ లిమిటెడ్, చైనా మొబైల్ లిమిటెడ్, హిక్‌విజన్ వంటి ప్రముఖ టెలికం సంస్థలు ఉన్నాయి. చైనా ప్రభుత్వానికి చెందిన ఏరోస్పేస్, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఇన్‌స్పుర్ గ్రూప్, హువావే, చైనా టెలి కమ్యూనికేషన్స్ ఉన్నాయి.

English summary

చైనాకు ట్రంప్ మరో షాక్, ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొద్దు | Donald Trump bars Americans from investing in Firms that help China’s military

President Donald Trump has signed an executive order banning Americans from investing in Chinese firms that the administration says are owned or controlled by the Chinese military.
Story first published: Friday, November 13, 2020, 13:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X