For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జోబిడెన్‌కు చిక్కులు, అలీపే సహా 8 చైనీస్ పేమెంట్ యాప్స్‌కు ట్రంప్ షాక్

|

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరోసారి షాకిచ్చారు. అలీపే, విచాట్ పే, క్యూక్యూ వ్యాలెట్ సహా 8 చైనీస్ పేమెంట్ యాప్స్‌ను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. అలీపే... యాంట్ గ్రూప్‌కు చెందిన పేమెంట్ యాప్ కాగా, వియ్‌చాట్ పే టెన్సెంట్ సంస్థ ఆధ్వర్యంలోనిది. ఈ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ నిర్వహించేందుకు వీలులేకుండా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలోనే ఎన్నికల్లో గెలిచిన జోబిడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పది రోజుల ముందు ట్రంప్ షాకిచ్చారు.

ట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షాక్, ఆ 3 చైనా కంపెనీలకు భారీ ఊరటట్రంప్‌కు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షాక్, ఆ 3 చైనా కంపెనీలకు భారీ ఊరట

బిడెన్‌కు చిక్కులు

బిడెన్‌కు చిక్కులు

ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ మరింత ముదిరింది. జోబిడెన్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ట్రంప్ చైనాకు లేదా చైనా సంస్థలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చే అధ్యక్షుడిని చిక్కుల్లోకి నెడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా చైనా యాప్స్‌పై మంగళవారం నిషేధం ఆదేశాలు జారీ చేశారు. జారీ అయిన 45 రోజుల తర్వాత నిషేధం అమల్లోకి వస్తుందని వాషింగ్టన్ తెలిపింది.

లావాదేవీలు నిర్వహిస్తే చర్యలు

లావాదేవీలు నిర్వహిస్తే చర్యలు

తాజా ఆదేశాల ప్రకారం ఎనిమిది చైనా యాప్స్ ద్వారా వ్యక్తులు లేదా సంస్థలు లావాదేవీలు నిర్వహిస్తే ఆర్థిక శాఖ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాలి. నిషేధం విధించిన యాప్స్ జాబితాలో అలీపే, క్యూక్యూ వాలెట్, విచాట్ పేతో పాటు కామ్ స్కానర్, షేర్ఇట్, వీమేట్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్‌ వంటివి ఉన్నాయి. యాప్స్ ద్వారా చైనా బల్క్ డేటా కలెక్షన్ చేపడుతున్నట్లు ట్రంప్ ఆరోపిస్తున్నారు. యూజర్లకు చెందిన ప్రయివేట్ సమాచారాన్ని యాప్స్ సంగ్రహిస్తాయని, దీంతో అమెరికన్లకు రిస్క్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

చైనీస్ సంస్థలకు చిక్కులు

చైనీస్ సంస్థలకు చిక్కులు

చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్, హువావే వంటి యాప్స్, సంస్థలు అమెరికాలో చిక్కుల్లో పడుతోన్న విషయం తెలిసిందే. గత నెలలో చైనాకు చెందిన పలు సంస్థలను అమెరికా కామర్స్ డిపార్టుమెంట్ ట్రేడ్ బ్లాక్ లిస్ట్‌లో ఉంచింది. అమెరికాలో అలీపే గత ఏడాది 2.07 లక్షల డౌన్ లోడ్స్ సాధించింది. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే యాప్ స్టోర్ నుండి డౌన్ లోడ్స్ నమోదయ్యాయి.

English summary

జోబిడెన్‌కు చిక్కులు, అలీపే సహా 8 చైనీస్ పేమెంట్ యాప్స్‌కు ట్రంప్ షాక్ | Donald Trump bans Alipay and seven other Chinese apps

The apps include popular payments platform Alipay, as well as QQ Wallet and WeChat pay. The order, which takes effect in 45 days, says that the apps are being banned because they are a threat to US national security.
Story first published: Wednesday, January 6, 2021, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X