For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాల్లో తేలిపోతున్నారు.... కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి...

|

జనాలకు ఓపిక తక్కువవుతోంది... ఏ పనైనా క్షణాల్లో అయిపోవాలి అనుకుంటున్నారు... ఎదురు చూపులు అంటేనే విసుక్కుంటున్నారు... ముఖ్యంగా ప్రయాణాల విషయంలో సౌకర్యంగా, లగ్జరీగా ఉండాలని భావిస్తున్నారు... కాస్త ఎక్కువ ఖర్చు అయినా పర్వలేదంటున్నారు. అందుకే విమానాల బాట పడుతున్నారు. కాస్త ఎక్కువ ఖర్చు అయినా తక్కువ సమయంలో ఎప్పుడంటే అప్పుడు గమ్యస్థానం చేరుకునే సదుపాయం ఉన్నందువల్ల విమానయానానికి ప్రాధాన్యం ఇస్తున్న వారు పెరుగుతున్నారు.

దాదాపు 4 శాతం వృద్ధి

దేశీయంగా విమాన ప్రయాణికులు అక్టోబరు నెలలో 3.98 శాతం మంది పెరిగారు. ఇందుకు దేశీయ పర్యాటకం ఎంతగానో దోహదపడింది. ఈ వృద్ధి నేపథ్యంలో విమానయాన పరిశ్రమలో రికవరీ మొదలైనట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో ఈ రంగం కేవలం 1.18 శాతం వృద్ధి తో సరిపెట్టుకుంది.

ఫార్చ్యూన్ బిజినెస్‌పర్సన్: అందుకే... సత్య నాదెళ్ల నెంబర్ 1ఫార్చ్యూన్ బిజినెస్‌పర్సన్: అందుకే... సత్య నాదెళ్ల నెంబర్ 1

గత నెలలో విమానయాన సంస్థలు 1.23 కోట్ల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేర్చాయి. గత ఏడాది ఇదే నెలలో ప్రయాణికుల సంఖ్య 1.18 కోట్లు గా ఉంది. దీంతో 3.98 శాతం వృద్ధి నమోదు అయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా వెల్లడించింది.

Domestic airline sector showing some recovery

విమానయాన కంపెనీలకు టూరిస్ట్ సీజన్ కూడా కలిసి వచ్చింది. ప్యాసెంజర్ లోడ్ ఫ్యాక్టర్ పెరిగింది. అంటే విమానంలో ఖాళీగా ఉండే సీట్ల సంఖ్య తగ్గిందన్న మాట.
అయితే ఎయిర్ ఇండియా , స్పైస్ జెట్, గో ఎయిర్, ఇండిగో, ఎయిర్ ఆసియా, విస్తారా కంపెనీల లోడ్ ఫాక్టర్ సెప్టెంబర్ తో పోల్చితే కాస్త తగ్గింది.

ఇండిగో హవా...

* ప్రయాణీకులను చేరవేయడంలోనే కాకుండా ప్యాసెంజర్ లోడ్ ఫాక్టర్ లో ఇండిగో ముందంజలో ఉంటోంది. అక్టోబర్ లో దేశీయ ప్యాసెంజర్ మార్కెట్లో ఇండిగో మార్కెట్ వాటా 47.4 శాతంగా ఉంది.
* స్పైస్ జెట్ మార్కెట్ వాటా సెప్టెంబర్ లో 14.7 శాతం ఉండగా అక్టోబర్ లో 16.3 శాతానికి పెరిగిపోవడం గమనార్హం. మార్కెట్ వాటా పరంగా రెండోస్థానంలో ఉంది.
* ఎయిర్ ఇండియా, గో ఎయిర్, ఎయిర్ ఆసియా, విస్తరా మార్కెట్ వాటా వరుసగా 12.6 శాతం, 11.2 శాతం, 6.5 శాతం, 5.4 శాతం గా ఉంది.

ఎయిర్ ఇండియా పై ఎక్కువ ఫిర్యాదులు

* గత అక్టోబర్ నెలలో దేశీయ ఎయిర్ లైన్స్ కంపెనీలపై ప్యాసెంజర్లు 791 ఫిర్యాదులు వచ్చాయి.
* ఈ నెలలో ప్రతి వెయ్యిమందికి 0.64 ఫిర్యాదులు నమోదయ్యాయి.
* సెప్టెంబర్ నెలలో ఎయిర్ ఇండియా పై 10,000 మందికి 1.6 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫిర్యాదుల పరంగా స్పైస్ జెట్ రెండో స్థానంలో ఉంది.

జెట్ ఎయిర్ వేస్ మూసివేతతో...

జెట్ ఎయిర్ వేస్ మూసివేత నేపథ్యంలో మిగతా ఎయిర్ లైన్స్ కంపెనీలు మార్కెట్ వాటాను పెంచుకునే అవకాశం ఏర్పడింది. కొత్తగా మరే కంపెనీ విమానయాన రంగంలోకి ప్రవేశించక పోవడం ఈ కంపెనీలకు కలిసివస్తోంది.

English summary

గాల్లో తేలిపోతున్నారు.... కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి... | Domestic airline sector showing some recovery

Indian aviation sector showing some recovery as this October domestic air passenger traffic increased by 3.98 percent. In September this year, the domestic passenger growth was just 1.18 per cent compared to the same month last year.
Story first published: Thursday, November 21, 2019, 21:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X