For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్పకాలానికి రుణం కావాలా? ఇవిగో మీకున్న అవకాశాలు...

|

కొంత మందికి కొంత కాలానికి మాత్రమే రుణ అవసరం ఉంటుంది. అలాంటి రుణాలను స్వల్పకాలిక రుణాలు అంటారు. ఇలాంటి వాటిని కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు అందిస్తున్నాయి. ఆయా సంస్థలు అందించే వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవడం ద్వారా ఏ సంస్థ నుంచి రుణం తీసుకోవాలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. సాధారణంగా స్వల్పకాలిక రుణాల గరిష్ట కాలపరిమితి ఏడాది కాలం ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ఆర్ధిక సంస్థలు అందిస్తున్న రుణాల వివరాలు తెలుసుకోవడం ద్వారా ఒక అవగాహన వస్తుంది. ఈ వడ్డీ రేట్లలో కాలాన్ని బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చు. రుణం తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి. ఇవిగో ఆ సంస్థలు..

బ్యాంకుల covid 19 ఎమర్జెన్సీ రుణాలు: ఏ బ్యాంకులో ఎంత కాలం ఊరట, ఎంత ఇస్తుంది?బ్యాంకుల covid 19 ఎమర్జెన్సీ రుణాలు: ఏ బ్యాంకులో ఎంత కాలం ఊరట, ఎంత ఇస్తుంది?

 క్యాష్ఈ

క్యాష్ఈ

* ఈ సంస్థ ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై నామమాత్రంగా చార్జీలు వసూలు చేస్తోంది. రుణ ప్రాసెసింగ్ ఫీజు 200 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది.

* 15 రోజుల నుంచి 12 నెలల కాలానికి రుణం తీసుకోవచ్చు.

* కనీసంగా 5,000 రూపాయల నుంచి గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందడానికి అవకాశం ఉంది.

* వడ్డీ రేటు 1.75 శాతం నుంచి 3.25 శాతం వరకు ఉంది.

* ఈ సంస్థ రుణ ఇచ్చే ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి సోషల్ మీడియా యాక్టివిటీ తో పాటు నెలవారీ ఆదాయం, విద్యార్హతలు, పనిలో ఉన్న అనుభవం వంటి అంశాలను పరిగణన లోకి తీసుకుంటుంది.

ఎర్లీ సాలరీ

ఎర్లీ సాలరీ

* ఈ సంస్థ ఏడు రోజుల నుంచి 43 రోజుల కాలానికి రుణాన్ని అందిస్తోంది.

* నెలవారీ వడ్డీ రేటు 2.5 శాతం గా ఉంది.

* కనీసం 8,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని తీసుకోవచ్చు.

* రుణాన్ని ఏవిధంగా ఏవిధంగా వినియోగించుకుంటారన్న దానిపై ఎలాంటి ఆంక్షలు లేవు

* ఎన్ని రోజులకాలానికి రుణం వినియోగించుకుంటే అంతకాలానికి వడ్డీ వసూలు చేస్తారు.

ఫండ్స్ టైగర్

ఫండ్స్ టైగర్

* సెక్యూరిటీ ఇచ్చినదాన్ని బట్టి, రుణ తీసుకునే పర్పస్ ను బట్టి వడ్డీ రేటు ఉంటుంది.

* మూడు నుంచి 12 నెలల కాలానికి రుణాన్ని ఈ సంస్థ అందిస్తుంది.

* 50 వేల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు రుణాన్ని అందిస్తోంది.

* కోలాటరల్ సెక్యూరిటీ తక్కువ వడ్డీ ను పొందడానికి అవకాశం ఉంది.

మనీ ఇన్ మినిట్స్

మనీ ఇన్ మినిట్స్

* 18 ఏళ్ళకన్నా ఎక్కువ వయసున్న వాళ్ళు రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు.

* వడ్డీ రేటు రోజుకు 0.25 శాతం నుంచి ఉంటుంది.

* ఒక రోజు నుంచి 6 నెలల కాలానికి రుణం తీసుకోవచ్చు.

* 1.500 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు.

* ఒకసారి తీసుకున్న రుణాన్ని చెల్లించిన తర్వాత తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తి గత రుణాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది.

English summary

స్వల్పకాలానికి రుణం కావాలా? ఇవిగో మీకున్న అవకాశాలు... | Do you want Short term loan? Here are the choices

Many want to take short term loans for their need. Here you have the options to take these loans. You can choose the organisations which offer loans at lower interest rate.
Story first published: Monday, March 30, 2020, 7:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X