For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిప్టో కరెన్సీ న్యూస్: భారీగా పతనమైన బిట్ కాయిన్, ఎథేరియం

|

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లును తీసుకు వస్తారనే వార్తల నేపథ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ క్రిప్టోలు ఇటీవల పతనమవుతున్నాయి. ప్రస్తుత డిప్ సమయంలో బిట్ కాయిన్‌ను కొనుగోలు చేయవచ్చునని పలువురు క్రిప్టో నిపుణులు సూచిస్తున్నారు. బిట్ కాయిన్ వ్యాల్యూ ప్రస్తుతం 55,000 డాలర్ల దిగువనే ఉంది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 54,469.60 డాలర్ల వద్ద ఉంది. మన కరెన్సీలో రూ.40,86,429.22 లక్షలు.

శుక్రవారం క్రిప్టో కరెన్సీలు మిశ్రమంగా కదలాడాయి. బియాన్స్ కాయిన్ భారీగా లాభ పడింది. దాదాపు నాలుగు శాతం ఎగిసింది. బిట్ కాయిన్ క్రితం సెషన్లో కాస్త కోలుకున్నప్పటికీ నేడు మళ్లీ క్షీణించింది. 59,000 డాలర్లకు చేరుకొని, మళ్లీ 54,000 డాలర్లకు పడిపోయింది. ఎథేరియం కూడా క్రితం సెషన్లో లాభపడినప్పటికీ ఈ సెషన్లో 4075 డాలర్లకు క్షీణించింది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 7.6 శాతం, ఎథేరియం దాదాపు పది శాతం నష్టపోయాయి. వివిధ క్రిప్టోలు...

 Crypto prices today: Binance Coin, Ethereum surge up to 4%

ఉదయం సెషన్లో బిట్ కాయిన్ 57,850 డాలర్ల వద్ద కనిపించింది. అయితే ఆ తర్వాత 55,000 దిగువకు పడిపోయింది. ఎథేరియం 4431 డాలర్ల వద్ద కనిపించి 4100 దిగువకు క్షీణించింది. బియాన్స్ కాయిన్ 622 డాలర్లు, టెథేర్ 1 డాలర్, సోలానా 203 డాలర్లు, కార్డానో 1.64 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 1.03 డాలర్లు, పోల్కాడాట్ 38 డాలర్లు, యూఎస్డీ కాయిన్ 1 డాలర్, డోజీకాయిన్ 0.22 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

క్రిప్టో కరెన్సీ న్యూస్: భారీగా పతనమైన బిట్ కాయిన్, ఎథేరియం | Crypto prices today: Binance Coin, Ethereum surge up to 4%

Cryptocurrency counters were mixed on Friday in the international and domestic markets amid concerns over India banning the currencies.
Story first published: Friday, November 26, 2021, 21:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X