For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వల్ల అత్యంత దారుణంగా దెబ్బతినే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రిటన్!

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, బ్రిటన్, చైనా, జపాన్ వంటి దేశాలు కూడా అతలాకుతలమవుతున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత తీవ్రంగా దెబ్బతినేది బ్రిటన్ అని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) హెచ్చరించింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 11.5 శాతం క్షీణతను నమోదు చేసే అవకాశముందని పేర్కొంది.

COVID 19: 100ఏళ్లలో చూడలేని మాంద్యం, అదే జరిగితే భారత ఆర్థిక పరిస్థితి ఊహించడమే కష్టంCOVID 19: 100ఏళ్లలో చూడలేని మాంద్యం, అదే జరిగితే భారత ఆర్థిక పరిస్థితి ఊహించడమే కష్టం

రెండోసారి విజృంభిస్తే కనుక..

రెండోసారి విజృంభిస్తే కనుక..

జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల కంటే కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని పేర్కొంది. కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించకుంటే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం, ఫ్రాన్స్ 11.4 శాతం, ఇటలీ 11.3 శాతం, స్పెయిన్ 11.1 శాతం, జర్మనీ 6.6 శాతం క్షీణించవచ్చునని అంచనా వేసింది. బ్రిటన్‌లో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తే మాత్రం ఏకంగా 14 శాతం క్షీణత నమోదు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా రెండోసారి విజృంభిస్తే ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలం వెంబడిస్తుందని తెలిపింది.

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ఇవే మూడొంతులు

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ఇవే మూడొంతులు

యూకే ప్రధానంగా సేవా ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ షట్ డౌన్ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ఫైనాన్షియల్ సర్వీసెస్, హాస్పిటాలిటీ, టూరిజం.. ఈ మూడు రంగాలదే మూడొంతులు ఉంటుంది. కరోనా దెబ్బకు అతలాకుతలమవుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్ తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, యూరో ఏరియా, కెనడా, జర్మనీ, అమెరికా, ప్రపంచం (సగటు), జపాన్, చైనా ఉన్నాయి. అంటే ప్రపంచ ఎకానమీ తర్వాత దెబ్బతినే వాటిలో జపాన్, చైనా ఉన్నాయి.

ప్యాకేజీ మరింత అవసరం

ప్యాకేజీ మరింత అవసరం

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ V ఆకారం కంటే U ఆకారంలో కోలుకోవచ్చునని ఓఈసీడీ అభిప్రాయపడింది. ఇటలీ, ఫ్రాన్స్ కంటే యూకే ఎక్కువగా దెబ్బతిన్నదని తెలిపింది. అదే సమయంలో 2021లో 9 శాతంతో బలమైన వృద్ధిని నమోదు చేయవచ్చునని అంచనా వేసింది. అయితే కరోనా మహమ్మారి విజృంభనను బట్టి ఉంటుందని తెలిపింది. ప్యాకేజీ ద్వారా లక్షలమంది ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ప్రశంసలు అందుకుంటున్న బ్రిటన్‌పై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. అదే సమయంలో బ్రిటన్ ప్రకటించిన ఈ రెస్క్యూ ప్యాకేజీ సరిపోదని తెలిపింది. ఇక, జర్మనీ గత వారం 4 శాతం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో వ్యాట్ తగ్గింపు, కార్ల కొనుగోలుపై భారీ రాయితీలు ఉన్నాయి.

త్వరగా కోలుకుంటాం...

త్వరగా కోలుకుంటాం...

ప్రపంచంలో అనేక ఆర్థిక వ్యవస్థలు కరోనా కారణంగా దెబ్బతిన్నాయని, అలాగే బ్రిటన్ పైన కూడా భారీ ప్రభావం చూపిందని, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి తాము చర్యలు చేపట్టామని, ఇది వేగంగా కోలుకోవడానికి ఉపకరిస్తుందని ఛాన్సులర్ రిషి సునక్ అన్నారు. మరో షాడో చాన్సులర్ అన్నెలీసి డాడ్ మాట్లాడుతూ.. OECD నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆరోగ్య సంక్షోభం తీవ్రమైందని, ఆలస్యంగా లాక్ డౌన్ విధించడం, అస్తవ్యస్త నిర్వహణ వంటి వివిధ కారణాలు ఇందుకుకారణమన్నారు.

English summary

కరోనా వల్ల అత్యంత దారుణంగా దెబ్బతినే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రిటన్! | Covid 19 Pandemic hits UK economy the hardest

The UK is likely to be the hardest hit by Covid-19 among major economies, the Organisation for Economic Co-operation and Development has warned.Britain's economy is likely to slump by 11.5% in 2020, slightly outstripping falls in countries such as Germany, France, Spain and Italy, it said.
Story first published: Friday, June 12, 2020, 7:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X