For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.10,000 వెంటిలెటర్ కేవలం రూ.7,500కే: కరోనాపై పోరుకు మహీంద్రా ఉదారత

|

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి వివిధ ప్రయివేటు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ ప్లాంట్లలో వెంటిలెటర్లు తయారు చేస్తామని ఇటీవల ప్రకటించింది. అంతేకాదు, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలెటర్‌ను తక్కువ ధరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనిపై మహీంద్రా గ్రూప్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వేతనాలు ముందే ఇచ్చిన కొటక్ మహీంద్రా, ఎన్నో జాగ్రత్తలువేతనాలు ముందే ఇచ్చిన కొటక్ మహీంద్రా, ఎన్నో జాగ్రత్తలు

వెంటిలెటర్ ఖరీదు రూ.7500

వెంటిలెటర్ ఖరీదు రూ.7500

రూ.10,000వరకు విలువ చేసే ఆధునాతన వెంటిలెటర్‌ను కేవలం రూ.7,500కే తయారు చేయగలమని ఆ కంపెనీ తెలియజేసింది. ఐసీయు వెంటిలెటర్లను సొంతగా తయారు చేయడంపై దృష్టి సారించామని, ఈ ఆధునాతన మెషీన్ల విలువ రూ.5 నుండి రూ.10 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. అయితే తాము తయారు చేసే ఆటోమేటెడ్ బ్యాంగ్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్ విలువ రూ.7,500 లోపు ఉండవచ్చునని పేర్కొంది.

అనుమతి వస్తే తయారీ

అనుమతి వస్తే తయారీ

ఈ మేరకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ఆటోమేటెడ్ బ్యాగ్ వాల్వ్ మాస్క్ వెంటిలెటర్ ఖరీదు రూ.7500లోపు ఉండవచ్చునని తమ బృందం అంచనా వేస్తోందనితెలిపారు. అనుమతుల కోసం మూడు రోజుల్లోగా ఓ నమూనాను సిద్ధం చేస్తామన్నారు. ఓసారి అనుమతి వస్తే తయారీకి సిద్ధమవుతామన్నారు.

ఆనంద్ మహీంద్రా థ్యాంక్స్

ఆనంద్ మహీంద్రా థ్యాంక్స్

ఈ వెంటిలెటర్ తయారు చేసిన తమ బృంద సభ్యులకు ఆనంద్ మహీంద్రా థ్యాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం వెంటిలెటర్లను తయారు చేస్తున్న రెండు ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు కంపెనీ ఎండీ పవన్ గోయెంకా తెలిపారు. డిజైన్‌ను పరిశీలించి, సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

English summary

రూ.10,000 వెంటిలెటర్ కేవలం రూ.7,500కే: కరోనాపై పోరుకు మహీంద్రా ఉదారత | Covid 19: Mahindra ventilators Just for Rs 7,500

M&M expects to come up with a ventilator at just Rs 7,500. It gains importance, as a ventilator generally costs around Rs 10,000. Ventilator assists in combating coronavirus pandemic. The virus has claimed over 17,000 lives worldwide. M&M hopes to have a prototype of an automated version of bag valve mask ventilator in three days of approval. Mahindra had also offered the facilities of the group's hospitality arm.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X