For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ: ఇప్పటి వరకు వివిధ స్టార్టప్స్‌లలో ఉద్యోగాల తొలగింత ఇలా..

|

కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో వివిధ కంపెనీలు ఉద్యోగాల కట్ లేదా వేతన కోతకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు వందలు, వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. దిగ్గజ సంస్థల్లో పెద్దగా ఉద్యోగాల కోత లేనప్పటికీ వేతనాల్లో కొంత కోత విధిస్తున్నాయి. ఉద్యోగాల కోత ఎక్కువగా స్టార్టప్స్‌లలో కనిపిస్తోంది. రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు ఎక్కువ శాలరీ ఉన్న వారికి కోత విధించాయి.

బిజినెస్ లేదని కాదు...!: ఇండియాబుల్స్‌లో 2,000 మంది ఉద్యోగుల తొలగింతబిజినెస్ లేదని కాదు...!: ఇండియాబుల్స్‌లో 2,000 మంది ఉద్యోగుల తొలగింత

వారంలో 3,000 ఉద్యోగాల కోత

వారంలో 3,000 ఉద్యోగాల కోత

ఓలా, స్విగ్గీ, షేర్‌చాట్, లైవ్‌స్పేస్, జొమాటో, క్యూర్ ఫిట్, బ్లాక్ బక్, ఉడాన్, ఓయో, వీ వర్క్ వంటి స్టార్టప్స్ మాత్రం ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. కేవలం ఒక వారం రోజుల్లోనే టెక్ యూనికార్న్స్ సంస్థల్లో 3,000 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో ఆదాయం లేదు. దీంతో పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఏ సంస్థలో ఎన్ని ఉద్యోగాలు పోయాయి?

ఏ సంస్థలో ఎన్ని ఉద్యోగాలు పోయాయి?

వివిధ సంస్థల్లో వందలు, వేలాది ఉద్యోగాలు పోయాయి. ఏ స్టార్టప్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయాయో చెబుతూ మేఘా విశ్వనాథ్ అనే సీనియర్ జర్నలిస్ట్ (అసిస్టెంట్ ఎడిటర్) ట్వీట్ చేశారు. ఆయా సంస్థల్లో ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఆ సంస్థలో ఉద్యోగం కోల్పోయిన వారి శాతం ఎంతనో చెప్పారు.

  • ఓలా: 1,400 (25%)
  • స్విగ్గీ: 1100 (14%)
  • షేర్ చాట్: 101 (25%)
  • లైవ్ స్పేస్: 450 (15%)
  • జొమాటో: 500 (13%)
  • క్యూర్ ఫిట్: 10% (ట్రెయినీస్)
  • బ్లాక్ బక్: 200
  • ఉడాన్: 3000
  • ఓయో: చాలామంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లో ఉన్నారు.
  • వీవర్క్ ఇండియా: 100 (20%)
సంపాదన కంటే ఖర్చులు ఎక్కువ

సంపాదన కంటే ఖర్చులు ఎక్కువ

లాక్ డౌన్ తొలి పది రోజుల్లోనే స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు దాదాపు 70 శాతానికి పైగా పడిపోయాయి. కరోనా-లాక్ డౌన్ ప్రభావం ఎక్కువగా ఎయిర్ లైన్స్, హాస్పిటాలిటీ తదితర రంగాలపై పడింది. పెద్ద సంస్థలు ఒకటి రెండు నెలలు ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలవు. కానీ స్టార్టప్స్ లేదా చిన్న సంస్థలకు తట్టుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్టప్స్ సంపాదన కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. డిమాండ్ తగ్గింది, ఆర్థిక కార్యకలాపాలు లేవు, లిక్విడిటీ ఎక్కువగా లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాయి.

English summary

ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ: ఇప్పటి వరకు వివిధ స్టార్టప్స్‌లలో ఉద్యోగాల తొలగింత ఇలా.. | Covid 19: Layoffs at startups so far

Coronavirus has spurred a bloodbath in India’s tech startup sector. Over 3,000 people have lost their jobs at Indian tech unicorns in one week.
Story first published: Friday, May 22, 2020, 13:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X